కరోనా.. కరోనా.. ప్రస్తుతం ఈ పేరు వింటేనే సామాన్య ప్రజల నుండి దేశాధిపతులదాకా అందరిని భయభ్రాంతుకు గురి చేస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచ దేశాలను అల్లా కల్లోలం చేస్తుంది. కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. కరోనా కారణంగా ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. దింతో దేశంలో ఇప్పటికే రవాణా వ్యవస్థను రద్దు చేశారు.

 

ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో వాణిజ్య రంగానికి ప్రధాన కేంద్రమైన మహారాష్ట కూడా లాక్ డౌన్ లోనే ఉంది. మన దేశంలో మొదటి కరోనా వైరస్ కేరళలో నమోదైన సంగతి అందరికి తెలిసిన విషయమే. కానీ దేశంలో ఎక్కువ కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇరవై మందికి పైగా చనిపోయారు. అందులో మహారాష్ట్రకు చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

 

అయితే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అనుసరిస్తుంది. అక్కడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన పిదప వివిధ రకాల వేతనాల చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించారు.

 

ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో కొంత శాతం కోత విధిస్తారు. మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లోను కోత విధిస్తారు. నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత విధిస్తారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: