ప్రపంచ దేశాలను సైతం వణికిస్తున్న కరోనా మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన కొన్ని లక్షల మంది పడ్డారు. కొన్ని వేల మంది వారి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. కొన్ని వందల మంది కరోనా వైరస్ నుండి కోలుకుంటున్నారు. ఈ వ్యాధి శర వేగంగా వ్యాపించడం వలన ప్రపంచ దేశాలు సైతం లాక్ డౌన్ విధించారు. మన దేశంలో సైతం ఈ మహమ్మారిని అరికట్టేందుకు కొన్ని కఠిన చర్యలు తీసుకుంటుంది.


వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. దేశంలో లాక్ డౌన్ విధించడం వలన ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది. ఇప్పటికే దేశంలో సినిమా థియేటర్లు, పాఠశాలలు మూసివేశారు. రవాణా వ్యవస్థ కూడా ఎక్కడి అక్కడ స్తంభించిపోయాయి. ప్రజారవాణా వలన రాష్ట్రానికి చాలా చాలా నష్టం వాటిల్లుతుంది. అది కాకా దేశంలో టాక్స్ లుం కూడా రద్దు చేశారు. దింతో మరి కొంత ప్రభావం ఎక్కువగా చూపుతుంది. 

 

కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పైన  చాలా ప్రభావం చూపిస్తుంది. దేశంలో లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా వెల్లడించాయి. అదే కోణంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సగం జీతం ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాన్ని రెండు విడతల్లో అందజేయునట్లు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు.

 

నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం వేతనం చెల్లిస్తామని సీఎం చెప్పారని సూర్యనారాయణ వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు తాము కూడా ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారని, తర్వాత యథావిధిగా జీతాల చెల్లింపు కొనసాగుతుందని సూర్యనారాయణ స్పష్టం చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: