మోడీ విషయంలో విపక్షాలు తరచూ చేసే విమర్శ ఒకటి ఉంది. అదేంటి అంటే ఆయన సైలెంట్ గా ఉంటే ప్రమాదమని అంటారు. మోడీ అన్ని రకాలుగా ఆరితేరిన నాయకుడు.  ఆయన ప్రపంచ దేశాలు తిరిగారు. అన్ని  విధాలైన  వ్యూహాలను తెలుసుకున్నారు. ఆయనలోని రాజకీయ చాణక్యుడు ఉన్నాడు.  కీలక సమయాల్లో ముందుకువస్తాడు. ఇపుడు దేశంలో అందరి చూపూ మోడీ మీదనే ఉంది.  

 

ఇదిలా ఉండగా దేశం ఇపుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరోనా వైరస్ మహమ్మారిగా మారి ముందుకు దూసుకువస్తోంది. కరొనాని నివారించడం ఎటూ  సాధ్యం కాదు. పెద్ద దేశాలు అపుడే చేతులెత్తేశాయి. ఇక మిగిలింది నియంత్రించడం. ఇపుడున్న పరిస్థితుల్లో దాన్ని కట్టడి చేయడానికే కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. అయితే అది కార్యరూపం దాల్చినా ఫలితాలు పెద్దగా కనిపించడంలేదు.

 

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పరిస్థితి ఉంది. ప్రజలను వీధుల్లోకి రానీయకుండా ఆయా రాష్ట్రాల  పాలకులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కావడంలేదు. దాంతో కరోనా మూడవ దశకు చేరుకుంటుందన్న బెంగ అందరిలోనూ వచ్చింది. అదే జరిగితే దేశం భారీ మూల్యం చెల్లించాల్సిఉంటుంది.

 

మూడు నుంచి నాలుగవ దశకు చాలా సులువుగా వెళ్ళిపోతుంది. అపుడు కచ్చితంగా 20 కోట్ల మందికి పైగా దేశ జనాభా బలి కావాల్సిఉంటుంది. ఈ ప్రమాదాన్ని ఊహించిన మోడీ సర్కార్ తన విశేష అధికారాన్ని ఉపయోగించబోతోందా అన్న సందేహాలు అందరిలో వస్తున్నాయి.

 

దేశంలో ఎమర్జెన్సీ విధిస్తారా అన్న భయాలు కూడా అందరిలో ఉన్నాయి. ఎమర్జెన్సీ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఉత్సవ విగ్రహాలు అవుతాయి. కేంద్రమే అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. దాంతో తరతమ భేదం లేకుండా ఎక్కడికక్కడ మిలట్రీని దింపి లాక్ డౌన్ని కచ్చితంగా అమలు చేస్తారు. అది జరిగితే తప్ప కరోనా వ్యాప్తిని అరికట్టలేమని అంటున్నారు. 

 

మరి మోడీ మదిలో ఏముందో చూడాలి. ఇప్పటికైతే లాక్ డౌన్ ప్రకటించి పది రోజులైంది. జనం మాత్రం పెద్దగా పట్టించుకోవడంలేదు. మరో వైపు కరోనా వైరస్  కేసులు పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టడానికి మోడీ తనదైన కఠిన  దండం తీస్తారని అంటున్నారు. చూడాలి ఏప్రిల్ నెలలో ఏం జరగబోతోందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: