తెలుగు మీడియా గ్రూపుల వారీగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఇది పత్రికల్లోనూ, టీవీ ఛానళ్లలోనూ క్లియర్ గా కనిపిస్తుంది. కాస్త మీడియాను ఫాలో అయ్యేవారికి ఈ తేడా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పసుపు దళంగా పేరు పడిన కొన్ని పత్రికలు, ఛానళ్ల వ్యవహారశైలి గురించి పాఠకులు, వీక్షకులు కూడా ఓ అంచనాతో ఉంటారు. అందులో అనుమానమే లేదు.

 

 

అయితే.. ఇప్పుడు రాష్ట్రానికి, దేశానికి గడ్డు కాలం నడుస్తోంది. కరోనా మహమ్మారి వందల మందిని కబళించేందుకు రెడీ అవుతోంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, మీడియా అంతా అన్ని భావజాలాలను పక్కకు పెట్టి ప్రజల కోసం కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. అయితే మీడియా యందు కొన్ని మీడియాలు వేరన్నట్టు... కొన్ని మీడియా సంస్థలకు ఇలాంటి కష్ట కాలంలోనూ తమ సొంత ప్రయోజనాలు, తాము పక్షం వహించే పార్టీల ప్రయోజనాలే ముఖ్యంగా ప్రసారాలు, రాతలు కొనసాగిస్తున్నాయి.

 

 

ఇలాంటి కష్టకాలంలో అంతా ఒక్కటై పని చేయాల్సిన తరుణంలో ఈ కరోనా వార్తల్లోనూ తమ నాయకుడికి లబ్ది చేకూర్చే అంశాలేవీ లేదా.. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే అంశాలేవీ అని లెక్కలు వేసుకుని మరీ ప్రసారం, ప్రచురితం చేస్తున్నాయి సదరు మీడియా సంస్థలు. ఇక్కడ కూడా రాజకీయం వదిలేదని లేదని తేల్చి చెబుతున్నాయి.

 

 

గ్రామ వాలంటీర్లు సరిగ్గా పని చేయడం లేదని.. రేషన్ సరుకులు ఇంటికి తెచ్చి ఇవ్వడం లేదని.. అందువల్లే ఓ మహిళ చనిపోయిందని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ కొన్ని తెలుగు దేశం అనుకుల మీడియా సంస్థలు రెచ్చిపోయి వార్తలు ప్రసారం చేయడం, కథనాలు ప్రచురించడం చూస్తే.. తెలుగు మీడియా ఇక మారదా అన్న నిస్పృహ కలుగుతోంది. మిగిలిన సమాయాల మాదిరిగానే కరోనా కాలంలోనూ జగన్ పై ద్వేషం చంద్రబాబు భజన చేయక తప్పదన్న ఆ మీడియా సంస్థల తీరు చూస్తే ఏమనాలో అర్థం కాని పరిస్థితి.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: