రాక్షసి రక్కసి కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మన ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... లాక్ డౌన్ ను ఎంతో సీరియస్ గా అమలు పరుస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలోనే బయట తిరుగుతున్న కొందరి యువకులను పోలీసులు కొట్టడం పలు వీడియోస్ లో మనం చూస్తూనే వున్నాం. వీటిపైన కొందరు అభ్యంతరం వెళ్లగక్కినప్పటికీ... ప్రస్తుత పరిస్థితులలో కఠిన నిర్ణయాలు తప్పవని మన ప్రభుత్వాలు చెప్పకనే చెబుతున్నాయి.

 

అయినప్పటికిని, రెండు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఒక్కరోజే... 17కరోనా కేసులు నమోదు అవ్వడంతో జగన్ సర్కార్ అప్రమయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తీవ్రతరమైన చర్యలను చేపట్టినట్లు కనబడుతోంది. కాసేపటి క్రితమే ప్రైవేట్ ఆసుపత్రులను, మెడికల్ కాలేజీలను కరోనా బాధితుల వైద్య అవసరాల నిమిత్తం ఉపయోగిస్తామని ప్రకటించడమే దానికి ఉదాహరణ.

 

ఇక ఈ ప్రకటనతో అవసరమైతే తెలంగాణలో కూడా, ప్రైవేట్ సంస్థలను బాధితుల నిమిత్తం వినియోగించుకుంటామని అక్కడి ప్రభుత్వం ఆలోచించినట్లుగా తెలుస్తోంది. కరోనాను అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించి వున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్యులకు తోడుగా ప్రైవేట్ వైద్యులు కూడా కరోనా కట్టడికి ముందుకు వస్తుండటంపై ఆనందించదగ్గ విషయం... ఇక విశ్వ వ్యాప్తంగా కేసులు సంఖ్యను పరిశీలించినట్లయితే... 

 

ప్రపంచలో మొత్తం కేసులు: 8, 02 , 639
మరణాలు: 39, 015
రికవరీ కేసులు: 1, 75, 321

 

ఇండియాలో మొత్తం కేసులు: 1357 
మరణాలు: 33 
కొత్త కేసులు: 47
రికవరీ కేసులు: 120 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 78
మృతులు: 6 
కొత్త కేసులు: 1 
యాక్టివ్ కేసులు: 61 
డిశ్చార్జి కేసులు: 14
ఏపీలో మొత్తం కేసులు: 40
మృతులు: 1 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: