కరోనా వైరస్ విషయంలో గ్రామాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలని చూసినా సరే కొందరి ద్వారా గ్రామాల్లో కరోనా వైరస్ విస్తరించే అవకాశాలు కనపడుతున్నాయి. గ్రామ స్థాయిలో కరోనా వైరస్ విస్తరించే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారు గ్రామాలలో ఉండిపోయారు ఇప్పుడు. వారు అందరూ కూడా ఇప్పుడు గ్రామాల నుంచి బయటకు రావడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వారు అందరిని కూడా ఇప్పుడు కట్టడి చెయ్యాలని, 

 

వారిని వెతికి పట్టుకోకపోతే మాత్రం కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది సాధ్యం కాదు అనే భావనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు వారి కోసం ప్రత్యేక బలగాలను గ్రామలలో దింపే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. గ్రామాల్లో బలగాలను దింపి వారిని గాలించి పట్టుకోవాలని, అవసరం అయితే వారి కుటుంబాలను క్వారంటైన్ కి బలవంతంగా తరలించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చినట్టు సమాచారం. కరోనా వైరస్ ఒక్కసారిగా గ్రామస్థాయిలో అడుగు పెడితే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఏమీ ఉండదు. 

 

దాన్ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అది మాత్రం అదుపులోకి వచ్చే అవకాశాలు ఉండవు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అందుకే కేంద్రాన్ని గ్రామాలు ఎక్కువగా భయపెడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామ స్థాయిలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై త్వరలోనే ఒక కార్యచరణ ను సిద్దం చేసి గ్రామాలకు పంపే యోచనలో ఉంది కేంద్రం. ఇప్పటికే దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ హోం శాఖతో కూడా చర్చలు జరిపారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: