కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా గణనీయంగా పెరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే నిన్న గాక మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఓ గుడ్ న్యూస్ చెప్పేశారు. ఇక రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు నమోదయ్యే అవకాశం చాలా తక్కువ. విమానాలు, బస్సులు, రైళ్లు అన్నీ బందు పెట్టినం కాబట్టి కొత్తవి రావు. ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు కూడా ఇక విడతల వారీగా డిశ్చార్జ్ అవుతారు అంటూ కొన్ని లెక్కలు చెప్పారు.

 

 

కేసీఆర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. ఏప్రిల్ 7నాటికి తెలంగాణ కరోనా ఫ్రీ అయిపోతుందని చెప్పుకొచ్చారు. అయితే అదంత ఈజీ కాదు.. ఆ విషయమూ కేసీఆర్ కు తెలియక కాదు. కానీ కరోనా అంటేనే భయపడి చచ్చే జనంలో కాస్త విశ్వాసం పాదుకొల్పడం కోసం కేసీఆర్ అలా చెప్పి ఉంటారు. అంది కూడా మంచిదే. ప్రజల కోసమే. కానీ.. ఇక్కడే ఓ సందేహం కనిపిస్తోంది.

 

 

ఆ రోజు ప్రెస్ మీట్లో కేసీఆర్ చెప్పినదాన్ని బట్టి చూస్తే.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 7 వరకూ క్వారంటైన్ నుంచి విడతల వారీగా బయటకు వచ్చే వారి సంఖ్య 11 వేల 381. కానీ అంతకు ముందు ప్రభుత్వమే ఇటీవల విదేశాల నుంచి 26 వేల మంది వరకూ రాష్ట్రానికి వచ్చారని సమాచారం ఇచ్చింది. ఇప్పుడు కేసీఆర్ చెబుతున్నది దాదాపు 12 వేల మంది క్వారంటైన్ నుంచి బయటకు వస్తారని.. మరి ఈ గ్యాప్ సంగతేంటి..?

 

 

ఈ రెండు సంఖ్యలకూ మధ్య తేడా అక్షరాలా 14 వేలు.. మరి అంత మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్లు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారు. వారి సంగతేంటి. వారిలో ఎందరికి కరోనా ఉండొచ్చు. వాళ్లు మళ్లీ ఎంత మందికి అంటించి ఉండొచ్చు..ఇప్పుడు ఈలెక్కలు తెలంగాణలో భయం గొలుపుతున్నాయి.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: