కరోనా వైరస్ ఇప్పట్లో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ని వదిలే అవకాశాలు కనపడటం లేదు. ఆమెకు వైద్యులు అయిదో సారి కరోనా పరిక్షలు నిర్వహించగా పాజిటివ్ అని వచ్చింది. దీనితో అధికారులు కూడా షాక్ అయ్యారు. ఎవరికి కూడా ఇన్ని సార్లు పాజిటివ్ గా రాలేదు. దీనితో ఆమె ఆరోగ్యం విషయం లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఆమెకు ఇప్పట్లో కరోనా తగ్గే లక్షణాలు లేవు అంటున్నారు కొందరు వైద్యులు. ప్రత్యేక వైద్య బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. 

 

 

కరోనా రిపోర్టు పాజిటివ్‌గా వచ్చిన రోగుల కు వైద్యులు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. వాస్తవానికి తొలి రెండు పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా తర్వాత నెగటివ్ వస్తుంది. కాని ఆమెకు వరుసగా 5 సార్లు పాజిటివ్ రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఆమెను ఇప్పుడు ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. అయినా సరే ఆమె ఆరోగ్యం విషయంలో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు తగ్గే అవకాశం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. 

 

 

ఆమె సాధారణ ఆహారమే తీసుకుంటున్నా ఆమె ఆరోగ్యం ఇప్పుడు విషమం గానే ఉన్నట్టు చెప్తున్నారు. ఇన్ని రోజులు కరోనా వైరస్ ఒంట్లో ఉంటే పూర్తిగా అనారోగ్యం బారిన పడతారని ఊపిరి తిత్తులు పూర్తిగా నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. ఆమెకు మరోసారి పరీక్ష చేసిన సమయంలో నెగటివ్ రాకపోతే మాత్రం ఆమెను విదేశాలకు పంపించి చికిత్స చేయించడం మేలు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె కోలుకోవాలని చాలా మంది పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: