కరోనా వైరస్ నియంత్రణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో అందరూ చూస్తున్నదే. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అందుకు జనాలు కూడా సానుకూలంగ స్పందించాలి. జనాలు పాజిటివ్ గా రెస్పాండ్ కాకపోతే సమస్యలు వస్తునే ఉంటాయి. ఈ విషయం తెలిసినా పచ్చమీడియా మాత్రం వైరస్ నియంత్రణలో జగన్ ఫెయిల్ అయినట్లు పదే పదే ఆరోపణలు చేస్తునే ఉంది. పైగా కరోనా వైరస్ ప్రమాదాన్ని సీరియస్ గా తీసుకోవటానికి జగన్ ఇష్టపడటం లేదంటూ పచ్చమీడియా తేల్చేసింది.  ప్రమాదాన్ని అర్ధం చేసుకోలేని జగన్ సిఎం కావటంతో ఇంతకన్నా జాగ్రత్తలు ఆశించటం కూడా దండగే అని చెత్తపలుకులో వచ్చింది.

 

వైరస్ నియంత్రణ విషయంలో జగన్ ప్రభుత్వం ఫెయిలయ్యిందని చెత్తపలుకులో వచ్చింది పూర్తిగా అబద్ధమే అనటంలో సందేహం లేదు. సంక్షోభ సమయంలో చంద్రబాబునాయుడు సిఎంగా లేడన్న ఏడుపే పచ్చమీడియా ఏడుపులో ఎక్కువగా కనబడుతోంది. ఇదే విషయాన్ని వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టంగా చెప్పాడు. ఇటువంటి సంక్షోభంలో చంద్రబాబు అధికారంలో లేకపోవటంతో కిరసనాయిల్ (రాధాకృష్ణ) వ్యాపారం దెబ్బతిన్నట్లు ఎద్దేవా చేశాడు.

ఇపుడు చంద్రబాబు గనుక సిఎంగా ఉండుంటే కరోనా వైరస్ పేరుతో రోజుకో ఫుల్ పేజి యాడ్ వచ్చి కిరసనాయిల్ వ్యాపారం పచ్చగా ఉండేదంటూ ఎంపి చెప్పినదాంట్లో సందేహమే లేదు. వైసిపి అధికారంలోకి రావటంతో వ్యాపారం చేసుకునే అవకాశం లేకపోవటంతో జగన్ వైరస్ విషయంలో సీరియస్ గా లేడంటూ మూర్చరోగి లాగ కొట్టుకుంటున్నాడంటూ విజయసాయి ఘాటు వ్యాఖ్యలే చేశాడు.

కరోనా వైరస్ దెబ్బకు ఎవరు చనిపోతారా అని ఎల్లోమీడియా గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తోందంటూ మండిపోయాడు. కరోనా అదుపులో ఉన్నందుకు ఇప్పటికే కుళ్లి కుళ్ళి ఏడుస్తున్న ఎల్లోమీడియా విశాఖపట్నంలో చనిపోయిన వృద్ధురాలిని చూసి ఆనందపడుతున్నారంటూ ఎంపి తీవ్రంగా మండిపడ్డాడు. మొత్తానికి విజయసాయి అన్నాడని కాదు కానీ టిడిపి వర్గాలు, ఎల్లోమీడియా మాటలు, చేష్టలు అలాగే ఉన్నాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: