కొరోనా వైరస్ విషయంలో అగ్రరాజ్యమైన అమెరికాలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే వైరస్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజు వేల సంఖ్యలో బాధితులు పెరిగిపోతున్నారు. దేశం మొత్తం మీద 1.56 లక్షల మంది బాధితులుంటే 3170 మంది చనిపోయారు. అదే సమయంలో వైరస్ నుండి బయటపడిన వారి సంఖ్య 5507. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బాధితుల సంఖ్యతో పోల్చితే రికవరీ అవుతున్న వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోంది.

 

అత్యున్నత వైద్య ప్రమాణాలు, జీవనవిధానం ఉన్న అమెరికాలోనే పరిస్ధితి ఇంత దయనీయంగా ఎందుకు మారిపోయింది ? ఎందుకంటే రోగుల సంఖ్య ఒక్కసారిగా వేలకు వేలు పెరిగిపోయింది. పెరిగిపోవటమే కాదు ఇంకా పెరుగుతోంది కూడా. రోజుకు కొన్ని వేలమంది రోగులు ఆసుపత్రులకు వచ్చేస్తుండటంతో ఏమి చేయాలో ప్రభుత్వంతో పాటు ఆసుపత్రులకు కూడా తోచటం లేదు.

 

ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆసుపత్రుల్లో  రోగులకు సరిపడా బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల యూనిట్లు లేవు. మామూలు పరిస్ధితుల్లో అమెరికా మొత్తం మీద 2.25 లక్షల సిలిండర్లు, వెంటిలేటర్లు, బెడ్లు కావాలి. ఏ రాష్ట్రంలో ఒకేసారి వేలకు వేల పేషంట్లు రారు కాబట్టి ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పటి పరిస్ధితుల్లో రోజుకు వేలాదిమంది రోగులు వచ్చేస్తున్నారు ఆసుపత్రులకు. ఆసుపత్రులకు వస్తున్న రోగుల లెక్క ప్రకారం 9 లక్షల వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల యూనిట్లు, బెడ్లు అవసరం.

 

అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే అవసరాలతో పోల్చుకుంటే అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలు చాలా చాలా తక్కువనే. అందుకనే చాలా ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోవటం లేదు. రోగులను ఎవరి ఖర్మానికి వాళ్ళని వదిలేస్తున్నాయి ఆసుపత్రులు.  రెండు వారాల క్రితం ఇటలీ, స్పెయిన్లో కనిపించిన వాతావరణమే ఇపుడు అమెరికాలో మొదలైంది. అందుకనే అమెరికాలో ఏమి జరుగుతోందో అర్ధంకాక అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: