క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 30వ తేదీ వరకూ రాష్ట్రంలో 23 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకుంటోంది. ప్రతిరోజు ఇదే విషయమై జగన్మోహన్ రెడ్డి సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తు యావత్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. పక్కన ఉన్న తెలంగాణాలో 70 కేసులు నమోదైనా ఏపిలో మాత్రం 23 కేసులే ఉండటంతో పరిస్ధితి అదుపులోనే ఉందని అనుకున్నారు.

 

సీన్ కట్ చేస్తే 31వ తేదీ మధ్యాహ్నానికి ఒక్కసారిగా పరిస్ధితిలో మార్పు వచ్చేసింది. మంగళవారం ఉదయానికి ఒక్కసారిగా 17 పాజిటివ్ కేసులు బయటపడటంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీలో రెండోవారంలో జరిగిన జమాతే నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్ధనల్లో ఏపి నుండి 711 మంది వెళ్ళారు. వెళ్ళిన వారు తిరిగొచ్చినపుడు వాళ్ళని గుర్తించి ప్రభుత్వం వైరస్ టెస్టులు చేసింది.

 

వీళ్ళల్లో వచ్చిన రిజల్ట్స్ ప్రకారం 17 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఇంకా రిజల్ట్సు రావాల్సుంది. అవికూడా వస్తే ఎంతమందికి వైరస్ సోకిందనే  విషయంలో క్లారిటి వస్తుంది. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం తక్కువలో తక్కువ సగంమందికి అంటే ఓ 300 మందికి వైరస్ సోకే అవకాశాలున్నాయట. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళినపుడు అక్కడున్న వారిలో చాలామందికి వైరస్ ఉన్న విషయం నిర్ధారణ అయ్యింది.

 

దాదాపు 2 వేల మంది నాలుగు రోజుల పాటు ఒకే భవనంలో ఉన్నారు కాబట్టి వందలాది మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన పడుతోంది. అదే నిజమైతే ఏపి డేంజర్ జోన్లోకి ప్రవేశించినట్లే అనుకోవాలి.  వచ్చే ఏడు రోజులు చాలా కీలకమని అంటున్నారు. ఒకసారంటూ డేంజర్ జోన్ లోకి ప్రవేశిస్తే దాన్ని ఆపటం చాలా కష్టం. పక్కనే ఉన్న తెలంగాణా పరిస్ధితి ఇంతకన్నా ఇబ్బందిగానే ఉంది. పరిస్దితి ప్రమాదకరంగా మారినపుడు చేయగలిగేది ఏముంది ? దేవుడి మీద భారం వేయటం తప్ప.

మరింత సమాచారం తెలుసుకోండి: