కరోనా ప్రభావం ప్రజలను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మహమ్మారి కరోనా నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూ ను విధించింది.. అలాగే కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..విడుదల సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. 

 

 

 


ఈ సందర్భంగా సినీ ప్రముఖులు వారి లోని కళలను వెలికి తీస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.. ఇకపోతే ఇప్పుడు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాలు ఇంట్లోనే ఉంటూ డబ్బింగు పనులు పూర్తి చేసుకుంటున్నాయి.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రమే కాదు ..సినీ ప్రముఖులకు కూడా ఈ భాధలు తప్పడం లేదు..కరోనా ప్రభావం తో సినిమా షూటింగ్ లు ఎక్కడిక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే..ఎటు చూసిన అన్ని రంగాలకు కరోనా భారీ షాక్ ఇచ్చింది. 

 

 

 

ఇకపోతే హైదరాబాద్‌లోని ఉప్పల్‌ గణేష్‌నగర్‌లో ఉండే వెంకటేశ్వర్లు దినసరి కూలీ. మద్యం దుకాణాలు మూసేసినప్పట్నుంచి భార్య, పిల్లలతో గొడవ పడుతున్నాడు. ఆదివారం రాత్రి భార్య, పిల్లలను బయటకు నెట్టేసి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్లకు చెందిన చింతకింది లక్ష్మయ్య కొన్ని రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నాడు. సోమవారం గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పురపాలిక పరిధి గండిమైసమ్మ చౌరస్తాలోని కల్లు కాంపౌండ్‌ వెనుక సోమవారం గుర్తుతెలియని 30-35 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని దుండిగల్‌ పోలీసులు గుర్తించారు.. 

 

 

 

ఇకపోతే తాజాగా మరికొన్ని కేసులు నమోదయ్యాయి...పటాన్‌చెరు పట్టణం జేపీ కాలనీలో భిక్షపతి కల్లు దొరక్క ఫిట్స్‌ బారిన పడి మరణించాడు. దీంతో ఒక్క పటాన్‌చెరు ప్రాంతంలోనే ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. సంగారెడ్డి మండలం తాళ్లపల్లికి చెందిన దేవదాసు కల్లు దొరక్క రెండు మూడు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రులతో పాటు ప్రధాన పట్టణాల్లో ఉన్న ప్రాంతీయ ఆస్పత్రులకు కల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ఇలానే కొనసాగితే. కరోనా కన్నా ముందుగా మద్యం ప్రియులు మరనించెలా ఉన్నారని తెలుస్తోంది... 

మరింత సమాచారం తెలుసుకోండి: