కరోనా కట్టడి కోసం ఏపీ సర్కారు అనేక చర్యలు తీసుకుంటోంది. అసలు కరోనా ఇష్యూనే మొదట్లో ఏపీ సీఎం జగన్ కు చిరాకు పుట్టించింది. స్థానిక ఎన్నికలను క్లీన్ స్వీప్ చేద్దామంటే ఈ మధ్యలో ఈ కరోనా గోలేంట్రా నాయనా అనుకున్న మాట నిజం. అందులోనూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఎన్నికల కమిషనర్‌ ఈ కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేయడంతో జగన్ కు చిర్రెత్తుకొచ్చిన మాటా నిజం. కానీ ఒక్క నాలుగైదు రోజుల్లోనే సీన్ మొత్తం మారిపోయింది.

 

 

దీంతో జగన్ కు కూడా కరోనా సీరియస్ నెస్ తెలిసొచ్చింది. ఆ వెంటనే చర్యలు ప్రారంభించారు. విదేశీయుల డాటాపై కసరత్తు చేశారు. వారిని ట్రాంకింగ్ చేయడం.. ఆ తర్వాత లాక్ డౌన్ ప్రకటించడం.. క్వారంటైన్లు ఏర్పాటు చేయడం ఇలా చకచకా పనులు సాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే విద్యార్థులను సరిహద్దుల్లో అడ్డుకోవడం, తెలంగాణతో సమన్వయలోపం వంటి అక్కడక్కడా అపశ్రుతులను మినహాయిస్తే.. జగన్ సర్కారు కరోనా ను హ్యాండిల్ చేస్తున్న తీరు బాగానే ఉంది.

 

 

అయితే ఇదే సమయంలో మోడీ జనతా కర్ఫ్యూ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్షనేత పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు. అక్కడి నుంచి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్సులు మాట్లాడుతున్నారు. రోజూ ప్రెస్ మీట్లు కూడా హైదరాబాద్ నుంచే పెడుతున్నారు. అలాగే మంగళవారం కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వం ఇంకా బాగా పని చేయాలి.. అందరినీ కలుపుకుపోవాలి.. మేం సహకరించడానికి సిద్ధం అంటూ చెప్పుకొచ్చరు.

 

 

అయితే అసలు పంచ్ ప్రెస్ మీట్ చివర్లో పడింది. అంతా ఓకే కానీ బాబోరూ.. మరి మీరు ఇలాంటి కష్టసమయంలో మీరు ఏపీలో ఉండకుండా హైదరాబాద్‌లో ఉండిపోయారేంటీ అని ఓ విలేకరి అమాయకంగానో.. నిజం రాబట్టాలనో అడిగేశాడు. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఈ మాత్రం క్వశ్చన్ అడుగుతాడని ఊహించరా ఏంటి.. చంద్రబాబు టకటకా సమాధానం చెప్పేశారు. ఏం చేస్తాను.. జనతా కర్ఫ్యూ సమయంలో హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత ఏపీ వద్దామనుకునే లోపే ప్రధాని లాక్‌ డౌన్ ప్రకటించారు. అందుకే ఇక్కడే ఉండిపోయా అన్నారు. అదీ సంగతి.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: