ప్రపంచంలో దాదాపు ప్రతి మనిషిని ఇంటికి పరిమితం చేసింది కరోనా వైరస్. ఈ వైరస్ ప్రభావం యూరప్ మరియు అగ్రరాజ్యం అమెరికాలో చాలా తీవ్రంగా ఉంది. భారతదేశంలో ఈ వైరస్ ప్రభావం వ్యాప్తి చెందకుండా ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా పకడ్బందీగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇటువంటి కీలక టైంలో ఎవరు కూడా నియోజకవర్గంలో లేకపోవడంతో ఇటీవల సీఎం జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజలను ఎంతో భయబ్రాంతులకు గురి చేస్తున్న ఈ కరోనా వైరస్ దాటికి చాలామంది గెలిచిన ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాల్లో ప్రాణభయంతో తలదాచుకున్నారు.

 

ఇదే పరిస్థితి చీరాల నియోజకవర్గంలో కూడా నెలకొంది. గెలిచిన టిడిపి ఎమ్మెల్యే ఎక్కడ కూడా కనపడటం లేదు. ప్రజలు అనేక అవస్థలు పడుతున్న గాని చీరాల నియోజకవర్గంలో సమస్యలను తెలుసుకోవడం కోసం ఎన్నికల్లో గెలిచిన వాళ్ళ అడ్రస్ లేకుండా పోయింది. ఇటువంటి సమయంలో...గెలుపుకి ఓటమికి సంబంధం లేకుండా రాజకీయాల్లోకి ప్రజల కోసమే వచ్చాను అన్నట్టుగా ఓడిపోయినా గాని చీరాల నియోజకవర్గంలో ప్రతి సమస్యను తెలుసుకుంటూ ప్రతి చోట తిరుగుతున్నారు ఆమంచి కృష్ణమోహన్. సామాన్య ప్రజలను అధిక ధరలు ద్వారా దోచుకోవాలని చూసే దుకాణదారుల దగ్గరకు వెళ్లి ఏ మాత్రం రేట్లు పెంచిన ప్రభుత్వపరంగా జైల్లో పెడతామని వార్నింగ్ ఇస్తూ ప్రజలకు భరోసా ఇస్తూ...ప్రభుత్వం నియమించిన ధరల పట్టిక బోర్డు బయటపెట్టాలి అంటూ సూచించారు.

 

అంతేకాకుండా ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు. అదే విధంగా మెడికల్ షాప్ దగ్గర హ్యాండ్ వాష్ ధర 50 రూపాయలకు మించకూడదని, డిస్టెన్స్ మెయింటైన్ అయ్యేటట్టు మార్కింగ్ ఉండేలా పెయింట్ తో మార్క్ చేయాలని, లేకపోతే షాపు తెరువ కూడదని ప్రతి షాపు యజమానులకు కరాఖండిగా ఆమంచి కృష్ణమోహన్  తెలియజేస్తూ పర్యటిస్తున్నారు. ఇదే సందర్భంలో గ్రామ వాలంటీర్లకు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి కీలక టైములో గ్రామ వాలంటీర్ల పనితనం చాలా బాగుందని ఉన్న ఎక్విప్మెంట్ తో అనగా మస్కూలు మరియు హ్యాండ్ వాష్ మిమి గ్రామపంచాయతీలో సెక్రెటరీ లను మున్సిపాలిటీ అయితే కమిషనర్లను సంప్రదించి ప్రజలకు అందజేయాలని సూచించారు. వాళ్ళు రెస్పాండ్ కాకపోతే నాకు మెసేజ్ పెట్టండి నేనయినా అందిస్తాను అంటూ ఆమంచి కృష్ణమోహన్ గ్రామ వాలంటీర్లకు సూచించారు.

 

ఇది మానవత్వం చాటుకో వలసిన సమయం అని ప్రజలను మనమే కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కరిని చైతన్య పరుస్తూ చీరాల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అంతే కాకుండా అన్ని విషయాలను చూసుకుంటున్న గ్రామ వాలంటీర్లకు 24 గంటలు పాటు మీకు అందుబాటులో నేను ఉంటాను అంటూ ఆమంచి కృష్ణమోహన్ వారికి కూడా భరోసా ఇచ్చారు. దీంతో చీరాల నియోజకవర్గంలో ప్రజలు గెలిచిన ఎమ్మెల్యే ఏమైపోయడో తెలీదుగానీ….సరైన టైమ్ లో ప్రజలకు అండగా ఉంటున్నాడు ఆమంచి కృష్ణమోహన్ అంటూ పొగుడుతున్నారు. మరికొంతమంది మానవత్వం ఉన్న మనిషి గా ప్రజలను చైతన్య పరుస్తున్నారు అని ఆమంచి వ్యవహరిస్తున్న తీరుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: