ఆయన ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ.. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన వాడు. ఈ దేశానికి ఎవరు ప్రధాన మంత్రులుగా ఉండాలో డిసైడ్ చేసినవాడు.. టైమ్స్ మేగజైన్ నుంచి అంతర్జాతీయ పత్రికలతో కీర్తించబడినవాడు.. అబ్బా.. ఇలాంటి వాడు మాకు నాయకుడుగా ఉంటే ఎంత బావుంటుందబ్బా అని.. దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు కలలు కనేలా చేసినవాడు.. ఇంత చెప్పాక ఆయన ఎవరో మీకు తెలియకుండా ఉంటుందా..?

 

 

అవును మీరు ఊహించినట్టే ఆయన చంద్రబాబునాయుడు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి. రాష్ట్రంలోనూ ఆయన ట్రాక్ రికార్డు సాధారణమైందేమీ కాదు. మరీ గతంలోకి వెళ్తే ఈ వ్యాసం సరిపోదు కానీ.. జస్ట్ గత ఆరేళ్ల నాటి కాలం లెక్కేసుకుంటే.. విశాఖలో హుద్ హుద్ వచ్చినప్పుడు.. బస్సులోనే నిద్రపోయి విశాఖను కాపాడినవాడు.. తిత్లీ తుపాను వచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఆదుకున్నవాడు.. ఇలా ఒకటా రెండా.. రాష్ట్రానికి సమస్య అంటూ వస్తే ముందు ఉండేది ఆయనే..

 

 

సరి సరే.. గత ఘనకీర్తుల సంగతి పక్కకు పెట్టి విషయానికి రమ్మంటారా..అక్కడికే వస్తున్నా.. మరి ఇప్పుడు ఏపీ కరోనా రూపంలో మరో భయంకరమైన కష్టంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారంలో లేకపోయినా సరే.. ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల ఆయన చిత్తశుద్ధిని ఎప్పుడూ శంకించలేం. కానీ.. ఈసారి ఏమైందో కానీ ఏపీ ప్రజలు కరోనా మహమ్మారి ప్రభావంతో అష్టకష్టాలు పడుతుంటే ఆయన మాత్రం హైదరాబాద్ కే బందీ అయిపోయారు.

 

 

ఇదే ప్రశ్న ఓ విలేఖరి అడిగాడు.. బాబుగారూ.. ఏపీ అల్లకల్లోలంగా ఉంటే..మీరేంటి హైదరాబాదులోనే ఉండిపోయారూ అంటే.. ఆయన చెప్పిన సమాధానం విని ఆ విలేఖరికే కాదు లైవ్‌లో ప్రెస్ మీటు చూస్తున్నవారందరికీ దిమ్మతిరిగిపోయింది. " ఏం చేయను.. నా మనసంతా ఏపీలోనే ఉంది. కాకపోతే లాక్‌ డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయా.. లేకపోతే వెళ్లే వాడినే.. హుద్ హుద్, తిత్లీ అప్పుడు ఎలా చేశానో మీకు తెలియదా.. ఇక్కడ హైదరాబాద్‌ లో కూడా ఖాళీగా ఏం లేను. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ ఇదే పని మీద ఉన్నా.. ప్రజలకు సూచనలిస్తున్నా.. మేధావులతో మాట్లాడుతున్నా.. అంటూ చెప్పుకొచ్చారు. పాపం ఆ సమాధానం విన్న వారు.. ఔరా ఎంత కష్టం వచ్చింది.. హుద్‌హుద్‌నే ఎదిరించిన మొనగాడికి మోడీ లాక్‌డౌన్‌ అడ్డొచ్చేసింది కదా.. ఏమీ విధి వైపరీత్యం అనుకుంటూ నిట్టూర్చారు. మీరూ అంతేనా.. అయితే డబల్ ఓకే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: