ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న పేరు కరోనా వైరస్. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన వైరస్ గా అనేకమంది మనిషి జీవితాలను బలి తీసుకుంటుంది. అగ్రరాజ్యం అమెరికా అయితే అతలాకుతలమవుతోంది. పేదవాడు అని లేదు ప్రధాని అని లేదు అందరిని టార్గెట్ చేసుకుంటూ తన పని తాను చేసుకుపోతుంది. ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రభావం రోజురోజుకి విజృంభిస్తోంది. 21 రోజులపాటు లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన..ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తుంటే పొడిగించే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల కరోనా వైరస్ పరీక్షల కోసం ఆన్లైన్ బుకింగ్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

 

ఈ పరిణామంతో ప్రాక్టో వైద్యపరీక్షల సంస్థ కరోనా డిటెక్షన్ పరీక్షలు చేసేందుకు ముందుకు వచ్చింది. కరోనా వైరస్ బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు కరోనా పరీక్షలు అందుబాటులో ఉంచేందుకు ఈ ఆన్లైన్ ను తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం మరియు ఐసీఎంఆర్ ఆమోదంతో బెంగళూరుకి చెందిన ప్రాక్టో సంస్థ కరోనా డిటెక్షన్ పరీక్షలు చేసేందుకు వీలుగా థైరో కేర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ సంతకం చేసిన క్యాస్ట్ రిక్వెస్ట్ చేసిన ఫోన్ టెస్ట్ రిక్విజిషన్ ఫారం, వ్యక్తి ఫొటో ఐడి కార్డును సమర్పిస్తే 4500 రూపాయలతో కరోనా పరీక్ష చేయటానికి ఈ సంస్థ రెడీ అయింది.

 

తాజాగా ఈ సంస్థ ముంబై లో తమ సేవలను అందిస్తోంది. త్వరలోనే దేశంలో ఉన్న మిగతా ప్రాంతాలకు కూడ విస్తరించిన డానికి రెడీ అవుతున్నారు. 48 గంటల్లో రిపోర్ట్ ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో వైరల్ గా మారింది. అంతేకాకుండా రోగి యొక్క నమూనాలను ఇళ్లకు వచ్చి సేకరించి వాటిని థైరోకేర్ ప్రయోగశాలలో పరీక్షల కోసం పంపించి రిపోర్ట్ ఇస్తున్నట్లు  ప్రాక్టో చీఫ్ హెల్త్ స్ట్రాటజీ ఆఫీసర్ డాక్టర్ అలెగ్జాండర్ కురువిల్లా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: