మోదీ షేర్ చేసిన యోగ నిద్ర వీడియో అద్భుతంగా ఉందని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా  కొనియాడారు. ప్రధాని మోదీ ట్విట్టర్లో యోగ నిద్రకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను ఇవాంక వీక్షించి అద్భుతంగా ఉందంటూ మోదీకి అభినంద‌న‌లు తెలిపారు. ఇంత మంచి వీడియోను షేర్ చేసినందుకు మోదీగారు మీకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ ధ‌న్య‌వాదాలు తెలిపింది. ‘‘నాకు తీరిక దొరికినప్పుడల్లా.. వారానికి ఒకటి రెండుసార్లు యోగ నిద్ర ప్రాక్టీస్ చేస్తాన’’ని ప్రధాని మోదీ తెలిపారు. ఆరోగ్యంగా ఉండటం కోసం, మనస్సు రిలాక్స్ కావడానికి, ఒత్తిడి తగ్గడానికి ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు.  

US President Donald Trump's daughter, Ivanka trump thanks prime minister narendra modi for sharing 'Yoga Nidra' video. pic.twitter.com/q2T2jGFRBA

— ANI (@ANI) March 31, 2020 " />

లాక్‌డౌన్‌ టైంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసం మోదీ ఈ వీడియో షేర్ చేసిన‌ట్లుగా కామెంట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా
ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఓ ప్రశ్నకు బదులిస్తూ.. లాక్‌డౌన్ సమయంలో ఫిట్‌గా ఎలా ఉండాలనే విషయమై వీడియోలను పోస్టు చేస్తానన్నారు.  చెప్పిన‌ట్లుగానే కొంత స‌మ‌యం త‌ర్వాత కొన్ని పాత వీడియోల‌ను ఆయ‌న పోస్టు చేశారు. అయితే ‘నేను ఫిట్‌నెస్ నిపుణ్ని కాదు. యోగా టీచర్‌ను కూడా కాదు. నేను సాధన చేస్తానంతే’ అంటూ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో మోదీ తెలిపారు. కొన్ని యోగాసనాలు తనకు అద్భుతంగా పనికొచ్చాయని, ఈరోజు త‌న ఆరోగ్యాన్ని ప‌దిలం చేసుకోవ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని తెలిపారు. 

 

ఇవాంక ఇప్ప‌టి వ‌ర‌కు రెండుసార్లు భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. స్వ‌త‌హాగా ఆమెకు భార‌త్ అంటే ఎంతో గౌర‌వ‌మ‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇక్క‌డి సంస్కృతి, సంప్ర‌దాయాలు, యోగ వంటివి త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇక‌ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్‌లో పాల్గొనడం కోసం 2017 చివర్లో హైదరాబాద్ వచ్చిన ఆమె ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగానూ మన దేశం వచ్చారు. తాజ్ మహల్ అందాలను తిలకించిన ఆమె ఆ క‌ట్ట‌డాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ప‌నిలో ప‌నిగా మ‌న టెకీల ప‌నిత‌నం ఎంతోగొప్ప‌గా ఉంటుంద‌ని కూడా కితాబిచ్చారు. 
 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: