దేశం మొత్తం క‌రోనా కోర‌ల్లో చిక్కుకుంటుందేమోన‌ని ప్ర‌జ‌లు హ‌డ‌లి పోతున్నారు. ఈ క్ర‌మంలో ప‌నులు కూ డా మానేసి ఇళ్ల‌లోనే ఉంటున్నారు. ఇక‌, ప్ర‌భుత్వాలు కూడా చేతులు ఎత్తేసిన ప‌రిస్థితి వ‌చ్చింది. ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని, బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని హెచ్చిరిస్తోంది. బ‌ల ప్ర‌యోగంతోనూ ప్ర‌జ‌ల‌ను దారికి తెస్తోం ది. దీంతో ప్ర‌జ‌లు ఎక్క‌డివార‌క్క‌డే ఉండిపోతున్నారు.  ప‌నులు చేసుకుంటేనే త‌ప్ప పూట‌గ‌డ‌వ‌ని పేద‌లు సైతం క‌లోగంజో తాగుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవుల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది.

 

కేవ‌లం వేత‌నాల‌పై బ‌తికే వాళ్ల‌ది మ‌రో ప‌రిస్థితి. ఇప్ప‌టికీ ఒక్క‌రు సంపాయిస్తే.. ముగ్గురు నుంచి న‌లుగురు తినే కుటుంబాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 40 శాతం పైగానే ఉన్నాయ‌నేది వాస్త‌వం. కార‌ణాలు ఏవైనా కావొచ్చు.. ఇలాంటి వారికి ప‌నిచేయ‌గా వ‌చ్చే డ‌బ్బులే ప్ర‌ధానం. అయితే, తాజాగా క‌రోనా మిష‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల్లో దాదాపు 50 శాతంగా పైగానే కోత పెట్టింది. దీనికి సంబంధించి తాజాగా కూడా జీవో జారీ చేసింది. నిజానికి మ‌రోప‌క్క‌, మార్చి నెల 15 నుంచే రాష్ట్రంలోనూ దేశంలోనూ క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు.

 

దీంతో ప్రైవేట సెక్టార్‌లో ప‌నిచేస్తున్న‌వారు కూడా దీనికార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఫ‌లితంగా వారికి స‌గం శాల‌రీనే వ‌స్తుంది. అయితే, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు జోక్యం చేసుకుని స‌గం జీతాలు ఇవ్వ‌డానికి వీల్లేద‌ని, పూర్తి వేత‌నాలు ఇవ్వాల‌ని ఆదేశాలు జారీచేశాయి. మ‌రి ఇన్ని నీతులు చెప్పి.. ప్ర‌బుత్వం స‌ర్కారీ నౌక‌ర్ల‌కు జీతాల్లో కోతపెట్ట‌డంవిస్మ‌యం క‌లిగిస్తోంది. దీనిని చూసి ప్రైవేటు సంస్థ‌లు ఉద్యోగుల‌కు జీతాల‌ను చెల్లిస్తాయా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అయినా, నిండు కుండ‌లాంటి తెలంగాణ అంటూ..బ‌డాయి పోతూ వ‌చ్చిన కేసీఆర్‌.. క‌రోనా కేసులు 70 న‌మోదు కావ‌డంతోనే జీతాల‌పై ఇలా నిర్ణ‌యం తీసుకోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు జోరందుకున్నాయి.

 

ఎప్పుడైనా దేశంలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీ ఏర్ప‌డి ఆర్టిక‌ల్ 360 అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌నాల్లో కోత‌లు విధించేందుకు అవ‌కాశం ఉటుంది. కానీ, ఇప్పుడు అలాంటి  ప‌రిస్థితి దేశంలోనే లేదు. మ‌రి ఇప్పుడు కేసీఆర్ ఇలా నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక వ్యూహం ఏంటి? ప‌్ర‌భుత్వం ఇప్ప‌టికే దివాలాదీసి ఉంటుందా? ఆయన మెహ‌ర్బానీ క‌బుర్ల‌కు, రాష్ట్ర ఖ‌జానాకు మ‌ధ్య పొంత‌న లేకుండా పోయిందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తానికి కేసీఆర్‌పై ఈ ఒక్క నిర్ణ‌యంతో తీవ్ర వ్య‌తిరేక‌త వ్యక్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.
 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: