ఒక చిన్న జీవి.. కంటికి కనిపించకుండా ప్రపంచాన్నే శాసిస్తుంది.. లోకం ఇంతగా అభివృద్ధి చెందని సమయంలో ఎన్నో వ్యాధులు వచ్చి వెళ్లాయి.. కాని అప్పటి సౌకర్యాలను బట్టి బ్రతికే వారు బ్రతికారు.. మరణించే వారు మరణించారు.. కాని నేటికాలంలో మానవులు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఒక మనిషి తలను మరో మనిషికి అమర్చి అతన్ని బ్రతికించారని చదివాము.. ఒక రకంగా మనిషి డిఎన్ఏతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని వైద్యశాస్త్రం చెబుతుంది.. మరి ఇంతటి మేధోసంపద మనిషికి సొంతం అయినప్పుడు.. అదే మనిషిచే కొన్ని రకాల జన్యువులతో సృష్టించబడిన కరోనా అనే వైరస్‌కు ఇప్పటి వరకు విరుగుడు కనుగొనబడలేదు..

 

 

ఇక ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో కొందరు కాలజ్ఞులు బ్రహ్మచే ఉపదేశం పొందినట్లుగా.. ఈ కరోనా గురించి మేము ముందే చెప్పాం అనే వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.. ఏమండి మీరు ఇలా చెప్పినప్పుడు అందర్ని అప్రమత్తం చేయవచ్చు కదా.. ఈ ఉపద్రవాన్ని ఆపడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు కదా.. ఆ మధ్య ఒకాయన కరోనాకు కేరళ ఆయుర్వేద వైద్యులు అద్భుత వైద్యాన్ని కనుగొన్నారు.. కేవలం మూడు గంటల్లోనే కరోనా రోగి కోలుకుంటాడని వార్తలు ప్రచురింపచేశారు.. మరి ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా ఆరులక్షల ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి.. చిటికెలో కరోనా వైరస్‌కు నివారణ అని చెప్పిన మేధావులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు..

 

 

ఇదే కాకుండా కొందరు జ్యోతిష్య పండితులు కూడా కరోనా గురించి ముందే హెచ్చరించాం అని యూట్యూబుల్లో తెగ హడావుడి చేస్తున్నారు.. మరి దీనికి నివారణగా ఎలాంటి పద్దతులు పాటించాలో చెప్ప వచ్చుగా.. ఎవరు ఎన్ని చెప్పిన కొన్ని వందల ఏళ్ల క్రితమే బ్రహ్మం గారు చెప్పారన్నది అక్షర సత్యం.. మరి వీరు ఇందులో కొత్తగా చెప్పిన విషయం ఏముంది.. అదీగాక జ్ఞానదృష్టికలిగిన వారికి ముంచుకొచ్చే ఉపద్రవంతో పాటుగా, దానికి విరుగుడు కూడా స్పూరిస్తుందనేది నిజం..

 

 

ఇకపోతే కరోనా వచ్చి రాష్ట్రాలన్ని నష్టాలపాలు అవుతుంటే కరోనా పేరిట ప్రజల్లో పేరు సంపాదించుకుంటున్న వారు ఈ విపత్తుకు ఏమైన సహాయ సహకారాలు అందిస్తున్నారా అనేది చెప్పండి.. మరి ఎందుకండి జరిగిన దాని గురించి అనవసర సొల్లు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు.. ప్రస్తుతం జరుగుతున్న పరిస్దితులకు నివారణ, రాబోయే కష్టాలకు మార్గం ఇవి చూపించండి చాలు.. ఇది ఒక్కరి ఆవేదన కాదు.. ఎందరి మదిలో రగులుతున్న ఆలోచన.. 

మరింత సమాచారం తెలుసుకోండి: