కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు అనగా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించడం జరిగింది.  దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఆలస్యం అయినా గాని లాక్‌డౌన్‌ అమలులోకి తీసుకు రావడంతో చాలా వరకు దేశంలో కరోనా వైరస్ అరికట్టడం జరిగింది. అయితే కొన్ని రాష్ట్రాలలో వలస కార్మికుల అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ మరియు ఉత్తర ప్రదేశ్ సరిహద్దులలో వలస కార్మికులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో పనులు లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్ళటానికి భారీ స్థాయిలో గుమిగూడి పోయారు.

 

అయితే ఈ విషయంలో ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్ సర్కార్ కొద్దిగా చొరవ తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తెలంగాణలో మాత్రం వలస కార్మికులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా...వాళ్లని తమ రాష్ట్రానికి సంబంధించిన వారు భావిస్తున్నట్లు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి ధైర్యం చెప్పడం జరిగింది. చాలామంది కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ వెళ్దామని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులు అనుకున్న తరుణంలో కేసీఆర్ చేసిన ప్రకటన వారి జీవితాల్లో వెలుగులు నింపినట్లు అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలసదారులు కూడా తమ బిడ్డల్లాంటి వారేనని.. ఒక్కొక్కరికి రూ.500 నగదు, 12 కిలోల రేషన్ బియ్యం ఇస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై యావత్తు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జాతీయ మీడియాలు కవర్ చేయలేదు.

 

దీంతో ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్న జాతీయ మీడియా పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వైరస్ విషయంలో అరికట్టే విషయంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారని వలసదారులకు మరియు రైతులకు ధైర్యం చెప్పారని...ఇటువంటి విషయాలు జాతీయ మీడియాలో ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. దానికి కెటిఆర్ స్పందిస్తూ అది జాతీయ మీడియా కాదు ఢిల్లీ మీడియా అంటూ సెటైర్ వేశారు. దీంతో నెటిజన్లు కూడా కేటీఆర్ చేసిన కామెంట్లకు మద్దతు తెలుపుతూ జాతీయ మీడియా తీరును వ్యతిరేకిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: