అయ్యబాబోయ్.. ఈ కరోనా వైరస్ వదిలేలా లేదు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 39వేలమందికిపైగా ఈ కరోనా బారిన పడి మృతి చెందారు. అంతేకాదు 8 లక్షలమందికిపైగా ప్రజలు ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ఇప్పటికే భారత్ లోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తుంది. 

 

అలాంటి ఈ కరోనా వైరస్ ను నియంత్రించాలని ప్రవేశించిన రెండు వారాల్లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తుంది. ఈ కరోనా వైరస్ కారణంగా ఆంధ్రాలో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

ఇంకా తెలంగాణాలో అయితే ఏకంగా 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క ఈరోజే కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర మాట్లాడుతూ ''మర్కజ్ నుంచి వచ్చిన వారికి, వారి బంధువులకు కరోనా వైరస్'' సోకిందని తెలిపారు. కాగా ప్రస్తుతం కరోనా బారిన పడ్డ 77మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని అయన తెలిపారు. 

 

తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి నిన్నటికే ఆరుగురు చనిపోయారు. అయితే కేవలం నిన్ననే ఐదుగురు చనిపోయారు. అయితే చనిపోయిన ఆరుగురూ వ్యక్తులు కూడా మర్కజ్‌లో ప్రార్థనలు నిర్వహించడానికి ఢిల్లీ వెళ్లొచ్చారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్ర చెప్పారు. ఒక్క ఈరోజే 15 మంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో తెలంగాణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అందుకే లాక్ డౌన్ విధించిన ఈ కొద్దీ రోజులు బయటకు రాకపోవడం ఎంతో మంచిది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: