గత ప్రభుత్వాల తో పోలిస్తే ఏపీలో ఇప్పుడు జనరంజక పాలన సాగుతోంది. ప్రజలు ఏ విషయంలోనూ ఇబ్బంది పడకుండా జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ఏపీలో అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడా అవినీతి అనేది లేకుండా ఎప్పటికప్పుడు జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పని పారదర్శకతతో జరగాలన్నదే జగన్ ధ్యేయంగా భావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చూసుకొంటున్నారు. అయితే కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం జగన్ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుండడం పై జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు గట్టిగా పార్టీ శ్రేణులను మందలిద్దామా అంటే ఇది సరైన సమయం కాదు అని వెనకడుగు వేస్తున్నారు.


 ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పై తప్ప మరే విషయంపైనా దృష్టి పెట్టే అవకాశం లేదు. ఇక ఏపీ సీఎం జగన్ కూడా పూర్తి దృష్టి అంతా కరోనా  వైరస్ కు సంబంధించిన విషయాలపైనే పెట్టారు. ఈ సందర్భంగా మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది..? జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ పనిచేస్తున్నాయా లేదా ? ఎప్పటికప్పుడు కరోనా వైరస్  వ్యవహారానికి సంబంధించి అధికారులతో సమీక్షిస్తున్నారు. నియోజకవర్గాల స్థాయిలో టాస్క్ఫోర్స్ లు ఏవిధంగా పనిచేస్తున్నాయి ఇలా అనేక అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన వారిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి వారు ఏఏ ప్రాంతాల్లో తిరిగారు అనే విషయాలను అధికారుల ద్వారా ఆరా తీసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 


ప్రతిరోజు ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలని, సర్వే నిరంతరంగా కొనసాగాలని జగన్ స్పష్టం చేశారు.కరోనా  లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి ఆరోగ్య వివరాలను అందించాలని, చదువుకున్న వారు, అవగాహన ఉన్నవారు ఆరోగ్యపరిస్థితిపై రిపోర్ట్ అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా వైరస్ విషయంలో కానీ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విషయంలో కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించడం, ఎప్పటికప్పుడు తాను ఈ విషయాలపై ఆరా తీస్తాను అంటూ ఇప్పటికే జగన్ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: