వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే కరోనా వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. అత్యంత ప్రమాదకరమైన ఈ కరోనా వైరస్ దేశంలో ప్రబలకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు రాష్ట్రంలో అమలు వచ్చేస్తున్నాయి. దేశ ప్రధాని మోడీ కూడా పూర్తిస్థాయిలో కరోనా వైరస్ విషయంపైనే ఫోకస్ అంతా పెట్టారు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ముఖ్యమంత్రులతో నాయకులతో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

అంతేకాకుండా ఏ విధంగా కేంద్రం నుండి సాయం కావాలి వంటి సలహాలు సూచనలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా డాక్టర్లతో మరియు రోగులతో కూడా మాట్లాడుతున్నారు. తరచుగా మీడియా ముందుకు వచ్చి జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. దేశంలో ప్రజలకు ఎలాగ, ఏవిధంగా ఇటువంటి కీలకమైన సమయములో మెలగాలో అందరికీ సూచనలు సలహాలు ఇస్తున్నారు. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే అందరి తో పోల్చుకుంటే ఏపీ సీఎం మీడియా సమావేశాలు హడావిడి చాలా తక్కువ.

 

ఇటువంటి టైములో విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఏపీ సీఎం జగన్ చేతల మనిషి అని ప్రచారానికి ఆయన ఎప్పుడూ దూరంగా ఉంటారని పేర్కొన్నారు. ఇతర నేతల్లోని ప్రచారకాంక్షను ఆయన ఎత్తిచూపుతున్నట్లుగా ఉన్నదనే అభిప్రాయాలూ వస్తున్నాయి. టాస్క్ విజయవంతం అయితే జగన్, ఆ క్రెడిట్ ను అధికారులకు ఇస్తారని పేర్కొన్నారు. దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండైరెక్టుగా కే‌సి‌ఆర్ కి విజయసాయిరెడ్డి పంచ్ వేశారని చాలా మంది రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: