నిజం.. నిజంగానే మందుబాబులకు ఇది గుడ్ న్యూస్. ఆన్లైన్ లో ఏ మద్యం కావాలో సెలెక్ట్ చేసుకుంటారు ఇంటికి వస్తుంది. ఇలాంటి సదుపాయం ఎక్కడ ఉండదు కదా! ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ కారణంగా మన భారత్ లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా 21 రోజులు లాక్ డౌన్ విధించడంతో మందుబాబులు అంత అల్లాడి పోతున్నారు. 

 

దీంతో కొందరు మద్యం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. మరికొందరు వారికీ వారే హానీ చేసుకుంటున్నారు. దీంతో మందుబాబుల ఆత్మహత్యలు ఆపడం కోసం కొన్ని ప్రభుత్వాలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మద్యం కొనుగోలు చేసుకోవచ్చని కేరళ వంటి ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే ఓ ప్రభుత్వం మాత్రం మరో ముందడుగు వేసింది. 

 

ఆ ప్రభుత్వం మేఘాలయ ప్రభుత్వం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న వారు.. ఆ ప్రిస్క్రిప్షన్ ని ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేస్తే ఇంటికే మద్యం తెప్పించుకునే అవకాశం కల్పిస్తోందని సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందట. ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫాం కోసం ప్రత్యేకంగా కొన్ని లిక్కర్ సంస్థలకు హోం డెలివరీ చేసే అవకాశం కల్పించనుందట. 

 

అయితే ఈ సేవలు ఏప్రిల్ 14 వరకూ కొనసాగుతాయని సమాచారం. కాగా ఇంటికే మద్యం సరఫరా చెయ్యడం మొట్టమొదటిసారి మేఘాలయలోనే జరుగుతుంది. కాగా కరోనా వైరస్ భారత్ లో అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. మనుషుల ప్రాణాలను తీస్తుంది. ఈ వైరస్ కారణంగా భారత్ లో ఇప్పటికే 32మంది మృతి చెందారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: