ఢిల్లీ లో జరిగిన మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారితో కరోనా మహమ్మరి తెలుగు రాష్ట్రాల్లో   విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది . ఇప్పటి వరకు నమోదయిన కేసుల్లో , ఎక్కువ మంది బాధితులు  ఢిల్లీ మతప్రార్ధనల్లో పాల్గొన్నవారే కావడం గమనార్హం .   అయితే ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో  ఇప్పుడు  ఇద్దరు సింగరేణి కార్మికులు కూడా ఉన్నారని తేలడం తో ,  అటు  సింగరేణి యాజమాన్యాన్ని  ... ఇటు సింగరేణి కార్మికుల కుటుంబాలను భయాందోళనకు గురి చేస్తోంది . ఇద్దరు  సింగరేణి కార్మికులకు కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలున్నట్లు తేలడం తో  , వారి ద్వారా  మిగతా కార్మికులకు  ఎవరికైనా  ఈ వైరస్ వ్యాప్తి చెందిందా?  అన్నదానిపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు  .

 

ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఇద్దరు  సింగరేణి కార్మికులను  మంచిర్యాల జిల్లా,  బెల్లంపల్లిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు . అయితే ఆ ఇద్దరు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని  వచ్చిన తరువాత విధులకు హాజరయ్యారా? , లేదా ?? అన్నదానిపై అధికారులు  ఆరా తీస్తున్నారు . వీరిద్దరూ భూగర్భం లో పని చేసే ఉద్యోగులా?,  లేకపోతే ఉపరితలం పనిచేసేవారా?? అన్నదానిపై సహచర కార్మికులను అడిగి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు  .

 

ఒకవేళ వారిద్దరు భూగర్భం లో పని చేసే కార్మికులైతే  కరోనా వైరస్ , ఇతర కార్మికులకు  శరవేగంగా అంటుకునే ప్రమాదం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు . భూగర్భ గనుల్లో అయితే సామాజిక దూరం పాటించే అవకాశం లేకపోవడం , ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదంటున్నారు .  ఈ ఇద్దరి ద్వారా మిగతా కార్మికులకు ఎవరికైనా   కరోనా వ్యాధి సోకిందా?, లేదా ?? అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి .      

మరింత సమాచారం తెలుసుకోండి: