కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తోంది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తుంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే దేశంలో 1300పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 39మంది మరణించారు. 

 

ఇకపోతే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మంగళవారం అంటే ఈరోజు ఎక్కువ నమోదయ్యాయి అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి దారుణంగా ఈ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేడు జార్ఖండ్‌లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదయింది. ఇప్పుడు అస్సాంలో కూడా తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమాంత బిస్వా శర్మ వెల్లడించారు. 

 

అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ 52 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు ఆయన తెలిపారు. దీంతో ఆ వ్యక్తికి సిల్చార్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నట్టు, అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. కాగా ఇప్పటికే మిజోరాం, మణిపుర్‌లో కరోనా కేసులు నమోదవ్వగా ఈరోజు అస్సాంలోని కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 

 

కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య చూస్తే భయం వేస్తుంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచదేశాలకు వ్యాపించి వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 8 లక్షలమంది కరోనా బారిన పడగా అందులో 39 వేలమందికిపైగా మృతి చెందారు. అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో రోజుకు కొన్ని వేలమంది మృతి చెందుతున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: