తెలంగాణ లో ప్రజాప్రతినిధులు , ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లో కోత విధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారో లేదో  ఇప్పుడు  ప్రైవేట్ సంస్థలు కూడా అదే బాటలో పెట్టనున్నట్లు తెలుస్తోంది . మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ , ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల చైర్మన్ల జీతాల్లో 75  శాతం కోత విధించనున్నట్లు , ఐఏఎస్ లు, ఐపీఎస్ లు , ఐ ఎఫ్ ఎస్ ల జీతాల్లో 60 శాతం కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . కరోనా కట్టడి నేపధ్యం లో దేశ వ్యాప్తంగా  లాక్ డౌన్  ప్రకటించడంతో ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది .

 

దాంతో ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు , పెన్షనర్లకు ఇచ్చే పింఛన్లలో కూడా కోత విధించాలని నిర్ణయించింది . లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ రంగ సంస్థలు కూడా తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి . ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా ప్రభుత్వ మార్గం లోనే పయనించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . ప్రభుత్వం విధించినట్లుగా కోతలు విధించకపోయినా , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరహా లో రెండు దశల్లో జీతాలు చెల్లించే అవకాశాలున్నాయని అంటున్నారు . ప్రైవేట్ రంగ ఉద్యోగులను ఇప్పటికే ఈ విధంగా యాజమాన్యాలు మానసింగా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.  

 

ఇక పత్రికారంగ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది . కొన్ని పత్రికల యాజమాన్యాలు ఇప్పటికి రెండు , మూడు నెలల జీతాలు పెండింగ్ లో పెట్టుకున్నట్లు సమాచారం . ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోను ఉద్యోగులకు  జీతాలిచ్చి ఆడుకోవాల్సింది పోయి , కనీసం సగం జీతం చెల్లించడానికి కూడా ఇష్టపడకపోవడం పట్ల పత్రికారంగ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: