తమ దేశంలో పుట్టిన కరోనా మహమ్మారిని  అంతమొందించేందుకు  చైనా దేశం...ఎప్పటి నుంచో వ్యాక్సిన్ తయారీకి కుస్తీ పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వ్యాక్సిన్ తయారీని మొదలుపెట్టి, దాని మీద ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఇక ఆ ట్రయల్స్ సక్సెస్ అయితే, ఆ వ్యాక్సిన్ ఇతర దేశాల్లో కూడా టెస్ట్ చేయనుంది.

 

గత ఏడాది డిసెంబర్ లో చైనా కరోనా మహమ్మారి బయటపడిన విషయం తెలిసిందే. ఆ దేశంలోని వుహాన్ నగరంలో ఈ కరోనా వ్యాప్తి మొదలైంది. ఇక అక్కడ మొదలైన కరోనా ప్రపంచమంతా వ్యాపించింది. అయితే చైనాలో దాదాపు 80 వేల మందికి పైనే  కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక 70 వేల మందికి పైనే రికవర్ అయ్యారు. ఇంకా  3 వేల మందికి పైనే ప్రాణాలు విడిచారు. ఇటు ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మందికి పైనే కరోనా బారిన పడ్డారు.

 

అయితే కరోనాకు మెడిసిన్ లేకపోవడంతో, అనేక దేశాలు మెడిసిన్ కనుక్కునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇటు చైనా కూడా మెడిసిన్ తయారు చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఓ వ్యాక్సిన్‌  అభివృద్ధి చేసింది. ఇక మార్చి 16న ఈ వ్యాక్సిన్‌‌కు తొలిదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.

 

ప్రస్తుతం క్లినికల్ దశలో కొందరు మీద పరీక్షించడానికి సిద్ధమైంది. అది కూడా కరోనా మహమ్మారి పుట్టిన వుహాన్ నగరంలో కరోనా సోకిన 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న వారిపై  ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక అక్కడ పరీక్షల్లో వ్యాక్సిన్‌ సక్సెస్ అయితే తర్వాత, చైనాలో నివశిస్తున్న విదేశీయులపై వ్యాక్సిన్‌ ఉపయోగించనున్నారు.

 

ఇంకా కరోనా ఎక్కువగా సోకిన మరో ఇతర దేశంలోనూ అంటే అమెరికాలో  గానీ, ఇటలీలో  గానీ దాన్ని పరీక్షించాలని అనుకుంటున్నారు. ఇక తర్వాత ఇతర దేశాల్లో కూడా ఈ వ్యాక్సిన్‌ను వాడే అవకాశం ఉంటుంది. మరి చూడాలి  చైనా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ వర్కౌట్ అవుతుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: