ప్రపంచ దేశాలన్నింటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ను ప్రస్తుతం ఎవరు పరిస్థితుల్లో లేరు. ముందస్తు చర్యగా భారతదేశం అన్ని దేశాల కన్నా ముందే లాక్ ప్రకటించినప్పటికీ ఇప్పటికే కేసుల సంఖ్య 1300 దాటింది. తాజాగా ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశం లో కొన్ని వందల మంది కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కరోనా పాజిటివ్ గా పరిస్థితి ఏర్పడింది. వారి నుండి అది ఎంతమందికి సంక్రమించిందో ఇప్పటికీ తెలియదు.

 

ఇంతలో అసలు వైరస్ కు కారణమైన చైనా వారిని తిట్టుకోని వాడెవడూ లేడు. అంతేకాకుండా చైనా వారు తమ దేశంలో చనిపోయిన వారి అసలైన సంఖ్యను వెల్లడించకుండా మిగతా దేశాలలో తప్పుదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.

 

ఇదిలా ఉండగా మొట్టమొదటిసారి చైనాలో కరోనా లక్షణాలతో ఒక వ్యక్తి ఆస్పత్రికి వచ్చినప్పుడు డాక్టర్ లీ వెనియాంగ్ దాని యొక్క ప్రమాదాన్ని గుర్తించి అందరినీ అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తే ఇతను అనవసరంగా ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాడని అతనిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చివరికి అతని వద్దకు వచ్చిన కరోనా పేషెంట్ల వల్ల అతనికి అది సంక్రమించి అతను కూడా అతను మరణించడం జరిగింది. సరిగ్గా చెప్పాలంటే పోలీసువారే అతనిని అరెస్టు చేసి అతని చావుకు కారణమయ్యారు.

 

అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే అతని లాగే ఫెన్ అనబడే మరొక డాక్టర్ కూడా కరోనా గురించి అధికారులను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించింది. ఆమె గతంలో వచ్చిన సార్స్ వైరస్ లక్షణాలతో ఉన్న వైరస్ వల్ల చాలా ప్రమాదం ఉందని.. తన పేషంట్ల పరిస్థితిని తాను చూస్తూనే ఉన్నాను అని చెప్పినా కూడా వినకుండా ఆమెను అబద్ధపు ప్రచారం చేస్తుందని అరెస్టు చేశారు.

 

దేశంలో లో  నిష్ణాతులైన డాక్టర్లు చెప్పినా వినకుండా అధికారులు ఇలా ప్రవర్తించడం అసలు చాలా సందేహాస్పదంగా ఉంది. చూస్తుంటే ఇదంతా చైనా కుట్రపూరితంగా వైరస్ ను వ్యాప్తి చేసిందని పలువురు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఫెన్ మాట్లాడుతూ తన పైవారికి డిసెంబర్ లోనే దీని గురించి చెప్పినా.... వారు పట్టించుకోలేదని బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ఆమె కాస్తా అదృశ్యమవడం అనేక సందేహాలకు దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: