కరోనా మహమ్మారి వల్ల తెలుగు రాష్ట్రాలు కూడా అతలాకుతలం అవుతున్నాయని తెలిసిందే. ఈవైరస్ ఆర్థికంగా కూడా  తీవ్ర నష్టం కల్గిస్తుంది. దాంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలబడడానికి ఇప్పటికే  సినీ హీరోలు, పారిశ్రామిక వేత్తలు భారీ గా విరాళాలను ప్రకటించారు. తాజాగా రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కూడా ఇరు రాష్ట్రాలకు 10కోట్ల చొప్పున మొత్తం 20కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ నగదును ఆన్లైన్ చెల్లింపుల ద్వారా నేరుగా ముఖ్యమంత్రుల సహాయ నిధి కి టాన్స్ ఫర్ చేశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా పై పోరులో విజయం సాధించాలని..ఉభయ రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని రామోజీ రావు ఆకాక్షించారు. 
 
ఇక కరోనా రోజు రోజుకు చెలరేగిపోతుంది. తెలంగాణ లో ఈ ఒక్క రోజే 15 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆంధ్రా లో 21 కేసులు నమోదు కావడం గమనార్హం. మొత్తం ఇప్పటివరకు తెలంగాణలో 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆంధ్రా లో 44 కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో నిజాముద్దీన్ బాధితులే ఎక్కువగా వున్నారు. ఇటీవల ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో మత ప్రార్ధనల పేరిట సమావేశం జరిగింది. ఈప్రార్థనలకు ఇండోనేషియా ప్రతినిధులు ఎక్కువ రావడంతో వారి నుండి మిగితా వారికి ఈ వైరస్ వ్యాపించింది.
 
తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 1700మంది ఈ ప్రార్ధనలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరందరని ప్రభుత్వాలు ట్రేస్ చేసి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుంది అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి ఈ నిజాముద్దీన్ ఎపిసోడ్ లేకుంటే ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: