కరోనా... ఈ పేరు  చెబితేనే ప్రపంచమంతా వణికిపోతోంది. చైనా దేశంలో పుట్టిన ఈ మహమ్మారి కులం, మతం, ప్రాంతం అనే తేడాలేకుండా అందరికి చుక్కలు చూపిస్తుంది. చికిత్స లేని రోగంగా ఉన్న ఈ కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా సైతం చుక్కలు చూస్తోంది. అసలు ప్రపంచంలోకెల్లా అత్యధిక కరోనా కేసులో అమెరికాలోనే ఉన్నాయి. అమెరికాలో మంగళవారం నాటికి 1,76,518 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక 3431 మంది మరణించగా,  6241 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

 

అయితే కరోనా ఉదృతి పెరిగిపోతుండటంతో అధ్యక్షుడు ట్రంప్...ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్  పాటించాలని పిలుపునిచ్చారు. ఇక ఈ కరోనా దెబ్బకు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల ప్రజలైతే ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఎక్కువగా ఈ నగరాల్లోనే కరోనా కేసులు నమోదు కావడంతో, అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

 

ఇక ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండకుండా ఓ టీవీ యాంకర్ అశ్రద్ధతో కరోనా తెచ్చుకున్నాడు. దిగ్గజ మీడియా సంస్థ సీఎన్‌ఎన్ ప్రైమ్ టైమ్ న్యూస్ యాంకర్ క్రిస్ క్యూమోకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన తాజాగా ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన ఈయన, కాస్త దూకుడు ప్రదర్శించి కరోనా రోగులతో కార్యక్రమాలు చేశారు. మరి ఆ సమయాల్లో ఎవరి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు గానీ, క్యూమోకు కూడా కరోనా వచ్చేసింది.

 

ఇక ఆ విషయన్నితన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ కష్టకాలంలో తనకు మరింత కష్టంగా మారిందని, గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ బారిన పడిన వారిని, ఆ మహమ్మారిని జయించిన వారిని మీ ముందుకు తీసుకొచ్చానని చెప్పిన క్యూమో,  ఆ తర్వాత తనకు  జ్వరం అంటుకుందని, పరీక్షల్లో కరోనాగా తేలిందని చెప్పాడు.  కాగా, క్యూమో న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు సోదరుడు కావడం గమనార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: