ప్రస్తుతం భారతదేశాన్ని వణికిస్తున్న కరుణ వైరస్ దృష్ట్యా ప్రభుత్వం 21 రోజులు లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే. అయితే దేశంలోని ప్రజలంతా ఇళ్ళకే పరిమితం కావడంతో ఎవరికి జీతాలు లేకుండా పోయాయి. రోడ్లమీద మెడికల్ షాపులు మరియు ఆసుపత్రులు, ఏటీఎం లు తప్ప మధ్యాహ్నం దాటితే ఒక్క షాపు ఉండటం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే కరోనా దయ వల్ల మధ్యతరగతి ప్రజలు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు.

 

ఇక డాక్టర్లు మరియు ఇతర వైద్య సిబ్బంది పరిస్థితి అయితే వర్ణనాతీతం. కనీసం వారి ఇంటిలోని వారిని వెళ్లి ప్రేమగా కౌగిలించుకునే వీలు కూడా వారికి లేకుండా పోయింది. ఇకపోతే కొంతమంది ఇంటి ఓనర్లు అయితే అద్దెకు ఉంటున్న డాక్టర్లను ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తున్నారు. అదీ కాకుండా చాలామంది మధ్యతరగతి ఉద్యోగులు, అద్దె ఇళ్లలో ఉన్నవారు టెన్షన్ పడుతున్నారు. ఉద్యోగాలు లేక వారికి అద్దెలు ఎలా చెల్లించాలి అని మదనపడుతున్నారు. కొత్త నెల రావడంతో ఇంటి యజమానులు ఇప్పటి నుండే అద్దెను అడగడం స్టార్ట్ చేస్తున్నారట. అయితే నెల కరెక్ట్ గా చెల్లించండి లేదా ఇల్లు ఖాళీ చేయండి అని వేధింపులు అప్పుడే మొదలు పెట్టేశారు.

 

దేశవ్యాప్తంగా సమస్య ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే కరోనా వైరస్ వల్ల దేశంలో అద్దె ఇంటిలో ఉన్న వాళ్ళు కొన్ని నెలలపాటు అద్దె చెల్లించే అవసరం లేదని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంటి నుండి కావాలని ఇంటి యజమానులు ఖాళీ చేయించాలని చూస్తే వాళ్లకి జైలు శిక్ష వెయ్యండి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.  దీంతో ఎవరైనా యజమాని ఇల్లు ఖాళీ చేయమంటే ఇటువంటి కీలకమైన టైమ్ లో అద్దెకు ఉండే వాళ్ళు నిర్మొహమాటంగా కేసు పెట్టవచ్చు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు. ఉచితంగా ఇంటి యజమానికి జైలు శిక్ష పడటం గ్యారెంటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: