కరోనా వైరస్...ఇది ఎక్కడ పుట్టింది...ఎన్ని దేశాల్లో వ్యాపించింది....ఎంత బీభత్సం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.  రోజుకు ఎంతమంది కరోనా వస్తుంది...ఎంతమంది చనిపోతున్నారనే దాని గురించే మాట్లాడుకోవాలి. ప్రస్తుతానికైతే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8.50 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 41 వేలకు పైగా చనిపోయారు. అయితే ఈ కరోనా కేసులు అత్యధికంగా అమెరికాలో ఎక్కువ ఉన్నారు. 1.81  లక్షల మంది అమెరికాలో కరోనా బారిన పడ్డారు. ఇక ఇందులో ఇందులో 3 వేలకు మందికి పైగా చనిపోయారు. అమెరికా తర్వాత కరోనా బాధితులు ఇటలీ, స్పెయిన్ లలో ఉన్నారు. ఈ దేశాల్లో కూడా వేల సంఖ్యలో చనిపోయారు.

 

అయితే ఈ కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో 81 వేలకు పైగా కరోనా బారిన పడితే, దాదాపు 76 వేలకు పైగా రికవర్ అయిపోయారు. మరణాలు కూడా 3 వేలు ఉన్నాయి. ఇక ఇండియాలో కరోనా బారిన 1400 మంది పడ్డారు. 50 మంది వరకు చనిపోయారు. ఇక ఇక్కడ ఈ సంఖ్యలని చూస్తే అమెరికా, ఇటలీ, స్పెయిన్ లలో కరోనా బీభత్సం సృష్టిస్తుందని అర్ధమవుతుంది.

 

ఇటు వాటి మీద పోలిస్తే, చైనా, ఇండియాలలో కరోనా దాడి తక్కువే ఉంది. ముఖ్యంగా చైనాలో అన్ని వేల మంది రికవర్ కావడం ఆశ్చర్యకరమైన అంశం. అయితే ఇలా కరోనా ప్రభావం ఇండియా, చైనాలలో తక్కువ ఉండి ... అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఎక్కువ ఉండటానికి ఓ ఆశ్చర్యకరమైన కారణం ఉందని తెలిసింది.

 

రోగ నిరోధక శక్తి ఇండియా, చైనా  ప్రజల్లో  ఎక్కువగా ఉండటం వల్లే కరోనా ప్రభావం తక్కువగా ఉందని, అది కూడా బాల్యంలో బీసీజీ టీకా వేయించుకున్నవారికి కరోనా ముప్పు తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికీ చైనా, ఇండియాలో రోగ నిరోధక శక్తి పెంచే ఈ టీకా వేయించుకుంటున్నారని, అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఇలాంటి టీకాలు వేయించుకోవడం ఎప్పుడో మానేశారని తెలిపారు.

 

అందుకే ఆ దేశాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉందని, రికవర్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ ఉందని వెల్లడించారు.  భారత్ లో పిల్లలకు బీసీజీ టీకాలు వేయడాన్ని 1949లోనే ప్రారంభించారని, ఇప్పుడు అదే టీకా కరోనా మహమ్మారిపై ఫైట్ చేస్తుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: