ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకేరోజు 14 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 58కు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఈ మేరకు ప్రకటన చేశారు. జిల్లాలోని ఏలూరులో ఆరు కేసులు, పెనుగొండలో రెండు, భీమవరంలో రెండు, నారాయణపురం, ఆకివీడు, గుండుగొల, ఉండిలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 
 
బాధితుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటంతో ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్కరోజే ఏపీలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 30 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 14 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇంకా 6 నివేదికలు అందాల్సి ఉందని తెలుస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 14 కరోనా పాజిటివ్ కేసులను ధృవీకరించాల్సి ఉంది. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 8,20,000 కు చేరగా మృతుల సంఖ్య 40,000 దాటింది. అమెరికాలో మృతుల సంఖ్య 3,400కు చేరింది. తెలంగాణలో ఇప్పటివరకూ 97 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 58 నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలలో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
ఈ నెల 14, 15 తేదీలలో ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ముస్లింలు మత ప్రార్థనలకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని జల్లెడ పడుతూ వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది. వారు ఢిల్లీ నుంచి వచ్చాక ఎక్కడ తిరిగారు... ఎవరెవరిని కలిశారనే వివరాలతో పాటు ఇతర వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: