పచ్చగా కొబ్బరి తోటలు, బత్తాయి తోటలు, నిమ్మ తోటలు, కోకో తోటలు ఇలా ఎక్కడ చూసినా సరే పచ్చదనం తో ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేగింది. ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాలు ఇప్పుడు కరోనా దెబ్బకు అల్లాడిపోతున్నాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్ళ నుంచి కరోనా వైరస్ ఇప్పుడు గోదావరి జిల్లాలకు పాకింది. ఆ లింక్ ని చేధించడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ గా మారింది. 

 

కరోనా కట్టడికి చర్యలు ఏ విధంగా తీసుకున్నా సరే ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్ళ ద్వారానే కరోనా వైరస్ ఇప్పుడు బయటపడటం ఆందోళన కలిగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా 15 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలుగుతుంది. అందులో జిల్లా కేంద్రం ఏలూరు లో 8 కరోనా పాజిటివ్ కేసులు, అదే విధంగా ఇతర ప్రాంతాల్లో మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

 

దీనితో పంట పొలాలకు వెళ్ళాలి అంటేనే భయపడుతున్నారు జిల్లా వాసులు. కరోనా నుంచి ఏ విధంగా బయటపడాలో అర్ధం కాక ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం ఏమో గోప్యంగా ఉంచుతుంది. ప్రతీ విషయాన్ని అధికారులు గోప్యం గా ఉంచడంతో ఇప్పుడు జిల్లా వాసులకు ఎక్కడ కరోనా ఉందో అర్ధం కావడం లేదు. దీనితో ఎప్పుడు ఎం జరుగుతుందో అనే భయం వారిలో నెలకొంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: