క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచంలో ఉన్న 200కు పైగా దేశాలు విల‌విల్లాడి పోతున్నాయి. ఎవ‌రికి వారు త‌ల్ల‌డిల్లి పోతున్నారు. అస‌లు క‌రోనా ఎప్పుడు ఎటు వైపు నుంచి ఎలా ?  వ‌స్తుందో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇక మిగిలిన దేశాల సంగ‌తేమో గాని టోట‌ల్‌గా క‌రోనాపై పోరాటం చేయ‌లేక చేతులు ఎత్తేసిన దేశం ఇట‌లీ. చివ‌ర‌కు ఆ దేశ అధ్య‌క్షుడు సైతం క‌రోనాను కంట్రోల్ చేయ‌లేక‌.. గుట్ట‌లు గుట్ట‌లుగా ప‌డి ఉన్న శ‌వాల దిబ్బ‌ల‌ను చూసి సైత క‌న్నీరు పెట్టుకున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

 

ప్ర‌పంచంలోనే ఎక్కువ క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు అయిన దేశంగా ఇట‌లీ రికార్డులు నెల‌కొల్పుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో ఏకంగా 12, 428 మంది చ‌నిపోయారు. ఆ త‌ర్వాత రెండో స్థానంలో స్పెయిన్ ఉంది. స్పెయిన్లో 8464 మంది చ‌నిపోయారు. ఇక ఇటలీలో బుధ‌వారంతో క‌రోనా పాజిటివ్ బాధితులు ల‌క్ష దాటేశారు. ఇప్పుడు అక్క‌డ క‌రోనా బాధితుల సంఖ్య 1,05, 792కు చేరుకుంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా అమెరికాలో మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్ష క‌రోనా బాధితులు ఉన్నారు.

 

క‌రోనా బాధితులు ఇప్ప‌టి వ‌ర‌కు 1.88 మంది ల‌క్ష‌ల మంది అమెరికాలో ఉన్నారు. ప్ర‌పంచంలో అమెరికా త‌ర్వాత ల‌క్ష బాధితులు ఉన్న రెండో దేశంగా ఇట‌లీ రికార్డుల కెక్కింది. చివ‌ర‌కు ఇట‌లీలో వైద్యం అందే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో క్యూబా నుంచి.. ప్ర‌పంచంలో ప‌లు దేశాల నుంచి ఇట‌లీకి చేరుకుని వైద్య స‌హాయం అందిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: