పశ్చిమ గోదావరి జిల్లా అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది కొబ్బరి తోటలు... వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. వేలాది మంది రైతులకు ఇదే జీవన ఆధారంగా ఉంది. అలాగే నిమ్మ, బత్తాయి తోటలు కూడా ఈ జిల్లాలో భారీగా ఉన్నాయి. ఈ విషయం అందరికి తెలుసు. ఇప్పుడు ఇక్కడి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని అంటున్నారు. ఒక్క నిమ్మాకాయి గాని, బత్తాయి గాని ఎగుమతి చేసే అవకాశం లేదు. 

 

వేసవిలో కొబ్బరికి మంచి డిమాండ్ ఉంటుంది. దాన్ని దిగుమతి చేసే వాళ్ళు లేరు. కనీసం కూలీలు కూడా రావడం లేదు. బత్తాయి తోటలు అన్ని కూడా ఇప్పుడు రాలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. వందల ఎకరాల్లో బత్తాయి పంట రాలిపోతుంది. దీనిపై రైతుల్లో ఒక రకమైన ఆందోళన అనేది వ్యక్తమవుతుంది. కరోనా వైరస్ దెబ్బ ఇప్పుడు రైతులకు గట్టిగా తగిలింది అనేది వాస్తవం. దీనితో ఏ రాష్ట్రానికి కూడా ఎగుమతులు అనేవి ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపుగా లేవు. 

 

వారి విషయ౦లో ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రైతులు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలా మంది కౌలు భూములు సాగు చేస్తున్నారు. కౌలు రైతులు ఇప్పటికే పంటలను కొనుగోలు చేసి ఉన్నారు. ఎగుమతులు లేక మార్కెట్ లేక వాళ్ళు తీవ్ర అవస్థలు పడే పరిస్థితి ఏర్పడింది. వెంటనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి న్యాయం చెయ్యాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: