ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ కేంద్రంగా క‌రోనా దేశ వ్యాపితమైన‌ట్లుగా భావిస్తున్న అధికారుల‌కు ద‌ర్యాప్తు చేస్తున్న కొద్దీ స‌రికొత్త విష‌యాలు తెలుస్తున్నాయి. మ‌లేసియా రాజ‌ధాని కౌలంలంపూర్ నుంచే క‌రోనా వ్యాప్తి మొద‌లైంద‌ని అధికారులు క‌నుగొన్నారు.  మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఒక్క సదస్సు దక్షిణాసియాలోని అనేక దేశాల నుంచి వంద‌లాది మంది ముస్లిం మ‌త పెద్ద‌లు హాజ‌ర‌య్యారు. తబ్లిగి జమాత్‌ సంస్థ కౌలాలంపూర్‌లోని పెటాలింగ్‌ మసీదులో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు 16 వేల మందితో సదస్సు నిర్వహించింది. ఆధ్యాత్మిక స‌దస్సులు నిర్వ‌హిస్తూ  ప్రవక్త చెప్పిన ఇస్లాం జీవనశైలి కలిగి ఉండాలని బోధిస్తుంది. 

 

బ్లిగి జమాత్‌ సంస్థకు వందేళ్ల చరిత్ర క‌లిగి ఉంది. కౌలలంపూర్‌లో జ‌రిగిన స‌ద‌స్సుకు హ‌జ‌రైన దాదాపు 1500మంది ముస్లిం ప్ర‌తినిధులు తిరిగి  ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ కేంద్రంలో జ‌రిగిన ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ స‌ద‌స్సులో భార‌త‌దేశం న‌లుమూల‌ల నుంచి వేలాది మంది ముస్లింలు కూడా హాజ‌ర‌య్యారు. మార్చి 16 త‌ర్వాత ఇక్క‌డి నుంచి తిరిగి త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోయారు. విదేశీయులు మాత్రం కొంత‌మంది మ‌ర్క‌జ్ భ‌వ‌న్‌లోనే ఉండిపోయారు. మ‌రికొంత‌మంది త‌మ దేశాల‌కు వెళ్లిపోయారు. కౌలాలంపూర్‌ సదస్సుకు హాజరైన 34 ఏళ్ల మలేసియన్‌ 17న  మృతిచెందాడు. 

 

అక్కడి పాజిటివ్‌ కేసుల్లో మూడో వంతు కేసులు జమాత్ స‌ద‌స్సులో పాల్గొన్న వారివే కావ‌డంతో ఇప్పుడు ద‌క్షిణాసియాకు చెందిన దేశాలు వ‌ణికిపోతున్నాయి. భార‌త్‌లో ఢిల్లీ నుంచి సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో రామగుండంకు వచ్చిన ఇండోనేసియన్లలో 10 మందికి మార్చి 20నే పాజిటివ్‌ అని తేల‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.  ఆ త‌ర్వాత మార్చి 26న ఈ సదస్సుకు హాజరైన కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి మ‌ర‌ణించాడు.  ఈ సమావేశాలకు హాజరైన వారిలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. అండమాన్‌లో బయటపడ్డ పాజిటివ్‌ కేసులకు మర్కజ్‌ సమావేశాలకు సంబంధం ఉన్నట్టు అధికారుల ద‌ర్యాప్తులో తేల‌డం గ‌మ‌నార్హం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: