దిల్లీలోని కొన్నిరోజుల క్రితం జరిగిన నిజాముద్దీన్‌లోతబ్లీగీ జమాత్‌ కార‌్యక్రమం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తోంది. కరోనా సునామీకి కారణమైంది. తెలుగోళ్ల గుండెల్లో కరోనా గంటలు మోగిస్తోంది. ఎందుకంటే.. ఈ కార్యక్రమానికి వెళ్లివచ్చిన వారికి కరోనా సోకినట్లు తేలుతోంది. తెలంగాణలో వెలుగులోకి వచ్చిన వెంటనే అప్రమత్తమైనట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సోమవారం నిజాముద్దీన్‌ మర్కజ్‌ నుంచి  వెయ్యి మంది కార్యకర్తలను ఆసుపత్రులకు తరలించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 


దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి 501 మంది కార్యక్రమంలో పాల్గొన్నారని హోంశాఖ వెల్లడించింది. అసోం నుంచి 216., ఉత్తరప్రదేశ్ 158, మహారాష్ట్ర 109, మధ్యప్రదేశ్‌ నుంచి 107 మంది పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్‌  73, ఝార్ఖండ్ 46..., కర్ణాటక నుంచి 45 మంది హాజరైనట్టు వెల్లడించింది. ఇప్పటివరకూ 2వేల 137 మందిని వేర్వేలు రాష్ట్రాల్లో గుర్తించగా... అందరికీ పరీక్షలు జరిపి క్వారంటైన్‌కు పంపే కార్యక్రమాన్ని... వేగంగా పూర్తిచేశామని ప్రకటించింది. 


ఇప్పుడు తెలంగాణలో మరణాలతో ఈ అంశం తీవ్రమైంది. వెంటనే ఆ సంస్థ కార్యకర్తలకు సంబంధించిన వివరాలను రాష్ట్రాలకు పంపినట్లు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. విదేశాల నుంచి వచ్చిన 824 మంది  దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారని  ఇప్పుడు వారందర్నీ గుర్తించి క్వారంటైన్‌కు పంపే కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించింది. అసలు  లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఒకే ప్రాంగణంలో వెయ్యిమంది ఎలా ఉన్నారు, అధికారులు ఎలా అనుమతి ఇచ్చారనే ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారంపైనా  కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది.  

 


ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి తబ్లీగీ జమాత్‌లో పాల్గొనేందుకు సుమారు 16 దేశాల నుంచి 2వేల 100 మందివరకూ విదేశీయులు రాగా వారిలో చాలా మంది లాక్‌డౌన్‌ ప్రకటించకముందే.. దేశంలోని విభిన్న ప్రాంతాలకు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి నిజాముద్దీన్‌కు వెళ్లినవారి సంఖ్యను గుర్తించిన కేంద్రం తెలుగు రాష్ట్రాల నుంచి రెండువేల మందికిపైగా వెళ్లారని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: