ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ ప్రార్థనల్లో పాల్గొని తిరిగొచ్చిన వారి ఆచూకీ క‌నుగొనేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించింది. ఈ మేర‌కు సోమవారం అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో డీజీపీ మహేందర్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో చాలామంది కరోనా బాధితులుండే అవకాశాలు ఉండటంతో వారి ఆచూకీ కనిపెట్టేందుకు రాత్రికి రాత్రి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. 

 

 జ‌మాత్ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న వారిలో ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా 10మంది చ‌నిపోగా తెలంగాణ‌కు చెందిన  ఐదుగురు ఒకేరోజు మరణించిన విష‌యం తెలిసిందే. ఇక ఏపీలో అయితే ప‌రిస్థితి ఆందోళ‌న‌కంగా ఉంది. రాష్ట్రం నుంచి 1000మందికి పైగా హాజ‌రైన‌ట్లుగా తెలుస్తుండ‌టంతో ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది. పోలీసుల్లో కొందరిని ప్రత్యేక బృందాలుగా విడిదీసి, గాలింపును తీవ్రతరం చేశారు. వైద్యారోగ్య శాఖతో కలిసి పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్‌ను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని మ‌త పెద్ద‌ల‌తో పోలీసులు మాట్లాడి ఆరా తీసే ప‌నిలో ప‌డ్డారు. ప‌రిస్థితి త్రీవ‌త‌ను తెలిపిన అధికారులు, నిజాలు దాచి స‌మాజానికి చేటు చేయ‌వ‌ద్ద‌ని హితవు ప‌లికారు. ఇదిలా ఉండ‌గా వెయ్యి మందికిపైగానే రాష్ట్రంలోని ప‌లు జిల్లాల నుంచి ముస్లిం ప్ర‌తినిధులు ఢిల్లీలోని ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యార‌ని పోలీసు అధికారులు ఓ అంచ‌నాకు వ‌చ్చారు.


ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ ప్రార్థనల్లో పాల్గొని తిరిగొచ్చిన వార ఆచూకీ తెలిసిన వెంట‌నే క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. వారితో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారితో స‌న్నిహితంగాఉన్న‌వారిని వెంట‌నే క్వారంటైన్‌కు పంపుతున్నారు. అలాగే వారి సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకుని కాల్ డేటా ఆధారంగా కూడా వేట‌ను ముమ్మ‌రం చేస్తున్నారు. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా వారు ఢిల్లీ వెళ్లొచ్చాక ఎక్కడెక్కడ తిరిగారో కూడా గుర్తించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. గూగుల్‌ మ్యాప్‌లో ఉన్న  సదుపాయం ఆధారంగా ఒక వ్యక్తి రోజూ ఏం చేశాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? తదితర సమాచారమంతా క్లియర్‌గా మ్యాప్‌లో కనిపిస్తుంది. దీని ఆధారంగా పోలీసులు మిగిలిన వారిని అప్రమత్తం చేసే పనిలోపడ్డారు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: