చైత్రమాసంలో నవమినాడు శ్రీరామనవమి పర్వదినం వస్తుంది.  మామిడిచెట్టు గుబుర్లలో కూర్చుని కోకిల రాగాలు వినిపించే మాసం చైత్రం. లేత చిగురాకులతో, మామిడి పూతతో, కాయలతో చెట్టు కళకళలాడిపోతుంటుంది. ఇక రామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. 

 

ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 2 శ్రీ‌రామ‌న‌వ‌మి వ‌చ్చింది. అయితే ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావం పండుగలపైనా పడింది. ఏటేటా అంగరంగ వైభవంగా కొనసాగే శ్రీరామనవమి ఉత్సవాలు ఈ సారి బోసి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క అదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో గుంపులు గుంపులుగా బయటికి వెళ్లకూడదని పరిస్థితి ఏర్పడింది. కచ్చితంగా సామాజిక దూరం పాటించాలి. 

 

దీంతో శ్రీ‌రామ‌న‌వ‌మిపై కూడా ఏపి ప్ర‌భుత్వం కొన్ని ఆంక్ష‌లు విధించింది. .. పండగ రోజున ఎవరు గుడికి వెళ్ళకూడదనీ , ఆలయ అర్చకులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో, ప్రజారోగ్యం మేరకు భక్తులు స్వచ్ఛందంగా దేవాలయ దర్శనాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పండుగ నాడు ఇంట్లోనే శ్రీరామనవమి పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ పర్యాయం నిరాడంబరంగా పండుగ జరుపుకుందామని, సామాజిక దూరం పాటిద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఇక అన్ని వైష్ణవ ఆలయాల్లో పూజలు కచ్చితంగా జరుగుతాయని అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపారు. సో.. రాములోరిని కూడా క‌రోనా వ‌ద‌ల‌డం లేద‌న్న‌మాట‌.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: