ఒక ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినప్పుడు ఆ ప్రమాదం నుండి ప్రజలను సాధ్యమైనంత వరకు రక్షించగలిగినవాడే బాధ్యతగల నాయకుడు.. మరి కరోనా విషయంలో ట్రంప్ వేసిన అడుగు తప్పటడుగే అంటున్నారు విశ్లేషకులు.. ముంచుకొస్తున్న కరోనా వైరస్‌ ముప్పు గురించి ఎందరు హెచ్చరించినా మొదట్లో బేఖాతరు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్వాకానికి ఆ దేశం ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన స్థితిలో పడింది. లక్ష నుంచి 2 లక్షలమంది వరకూ ఈ వ్యాధికి బలయ్యే ప్రమాదం వున్నదని ‘చావు కబురు’ చల్లగా చెప్పినట్టు ఆయన ఇప్పుడు ప్రకటిస్తున్నారు.

 

 

ఇక కరోనా ప్రమాదం గురించి సరిగ్గా నెలక్రితం ప్రస్దావన వచ్చినప్పుడు ఆయన కొట్టిపడేశారు. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధి గురించి మార్చి 3న హెచ్చరిస్తూ, దీని బారిన పడినవారిలో 3.4 శాతం మంది బలయ్యే అవకాశం వున్నదని పేర్కొనగా, అదంతా అబద్ధమని ట్రంప్‌ తోసిపుచ్చారు. అంతే కాకుండా అతిగా అంచనాలు వేసి ప్రజలను భయపెట్టొద్దని సలహా కూడా ఇచ్చారు. కానీ ఇంతగా ప్రాణ నష్టం జరిగితే కానీ ఆయన కళ్లకు అడ్డుగా ఉన్న మాయపొర తొలగలేదు.. చైనాలోనే కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తాయనుకుంటే అది ఇటలీ దాటేసింది.. ఆ తర్వాతి స్దానాన్ని అమెరికా ఆక్రమిస్తుంది..

 

 

అగ్ర రాజ్యంగా ఇన్నాళ్ల నుండి చెప్పుకుంటున్న అమెరికా ప్రపంచదేశాలకు ఆదర్శంగా ఉండవలసింది పోయి ఈ సమయంలో తానే గోతిలో పడింది.. ఇకపోతే మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 8,00,000 దాటి ముందుకుపోగా, ఇందులో ఒక్క అమెరికాలోనే 1,65,000 మంది వున్నారట.. ట్రంప్‌ చేసిన నిర్లక్ష్యానికి, నిలకడలేని ప్రకటనలు అక్కడి ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తాయి. ఇక ముందు జాగ్రత్త పడ్ద దేశాలు మాత్రం ఇప్పుడు కొంతవరకు ఈ కరోనా తీవ్రతనుండి బయటపడ్డాయని చెప్పవచ్చూ.. ఇక అమెరికాలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్యను చూస్తే దీనికంతటికి కారణం ఆ దేశాధ్యక్షుడే అనే నిందను ట్రంప్ మోయకతప్పదని అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: