దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌తో వ‌ల‌స కూలీలు, కార్మికులు అల్లాడిపోతున్నారు. ఏం జ‌రుగుతుందో తెలియ‌ని భ‌యాందోళ‌న‌తో వంద‌ల‌కిలీమీట‌ర్లు కాలిన‌డ‌క‌న త‌మ సొంతూళ్లకు వెళ్తున్నారు. బ‌తువుదెరువు కోసం ప‌ల్లెలు, గ్రామాల నుంచి ప‌ట్ట‌ణాలు, పెద్ద‌పెద్ద న‌గ‌రాల‌కు వ‌ల‌స‌పోయిన వారు ఇప్పుడు దిక్కుతెలియ‌ని, దారితోచ‌ని ద‌య‌నీయ స్థితిలో ప‌డిపోయారు. అయితే.. వ‌ల‌స కూలీల‌ను, కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చ‌ర్య‌లు చేప‌ట్టారు. నిజానికి.. దేశంలోని మ‌రే రాష్ట్రంలోనూ చేప‌ట్ట‌ని విధంగా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. వ‌ల‌స కార్మికుల‌కు భ‌రోసాగా నిలుస్తున్నారు. కార్మికులంద‌రినీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగ‌స్వాముల‌వుతున్న‌వారిగా ఆయ‌న గుర్తించారు. బ‌త‌కడానికి తెలంగాణ‌లోకి ఏ రాష్ట్రం నుంచి వ‌చ్చినా.. వారికి అస‌వ‌ర‌మైన నిత్యావ‌స‌ర స‌రుకులను అందిస్తున్నారు. ఒక్కొక్క‌రికి 12కిలీల బియ్యంతోపాటు రూ.500రూపాయ‌ల‌ను అందిస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఇస్తున్న చేయూత‌తో కూలీలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఆపత్కాలంలో ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. 

 

నిజానికి.. దేశ‌వ్యాప్తంగా ఒక్క‌సారిగా లాక్‌డౌన్ విధించిన‌ప్పుడు ఒక‌టిరెండు రోజులు వ‌ల‌స కూలీలు, కార్మికుల గురించి పెద్ద‌గా కేంద్రం కూడా ప‌ట్టించుకోలేదు. కానీ.. క్ర‌మంగా ప‌లువురు కార్మికులు కాలిన‌డ‌క త‌మ సొంతూళ్ల‌కు బ‌య‌లుదేర‌డంతో ఇదే స‌మ‌స్య‌గా మారింది. దీంతో వెంట‌నే అప్ర‌మ్త‌త‌మైన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. అధికార యంత్రానికి దిశానిర్దేశం చేశారు. వ‌ల‌స కార్మికులు,కూలీలు ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఆక‌లితో అల‌మ‌టించ‌వ‌ద్ద‌ని, వారికి అస‌వ‌ర‌మైన అన్నిసౌక‌ర్యాలు క‌ల్పించి వారిని ఆదుకోవాల‌ని ఆదేశించారు. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన అధికారులు జిల్లాలు, మండ‌లాలు, గ్రామాల‌వారీగా ఉన్న వ‌ల‌స కార్మికులు, కూలీల‌ను గుర్తించారు. సోమ‌వారం నుంచి అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు క‌లిసి కూలీల‌కు 12కిలోల బియ్యంతోపాటు రూ.5రూపాయ‌లు అంద‌జేస్తున్నారు. నిజంగా.. ఇంత‌టి సంక్లిష్ట ప‌రిస్థితుల్లోనూ వ‌ల‌స కార్మికుల కోసం ఇలాంటి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం గొప్ప‌విష‌య‌మ‌ని అంద‌రూ కొనియాడుతున్నారు. ఒక‌వైపు క‌రోనా క‌ట్ట‌డికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటూనే మ‌రోవైపు బ‌తుకుదెరువు కోసం ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారికి అండ‌గా నిల‌బ‌డ‌డంపై దేశ‌వ్యాప్తంగా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: