ప్రపంచాన్ని మొత్తం మరణశాసనంతో శాసిస్తుంది కరోనా.  ఈ పేరు చెబితేనే చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు సామాన్యు ల నుంచి సెలబ్రెటీల గజ్జున వణికి పోతున్నారు.  అయితే కరోనా వైరస్ వల్ల ఎంత మంది చనిపోతున్న విషయం తెలిసినా.. కొంత మంది మాత్రం దీన్ని ఆసరగా చేసుకొని మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.  కరోనాని కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  దాంతో నిత్యావసరాలు తప్ప మిగిలిన షాపులన్నీ బంద్ చేస్తున్నారు. 

 

తెలంగాణలో మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్‌కు చెందిన కె.సనీష్ కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నెల 28న సోషల్ మీడియాలో మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయన్న పోస్టును చూశాడు. అయితే దాన్ని కాపీ చేసి  ప్రభుత్వ జీవోలా దానిని మార్చి మద్యం వ్యాపారి అయిన తన స్నేహితుడు గౌడ్‌కు పంపించాడు. అది చూసి నిజమేనని నమ్మిన ఆయన మరికొందరికి పంపించాడు.

 

 

అంతే ఒక్క గంటలో ఇది కాస్త వైరల్ అయ్యింది.. ఇక తాగుబోతుల్లో ఎక్కడ లేని సంతోషాలు వెల్లువిరిసాయి. ఇక మద్యం షాపులు తెరుచుకోబోతున్నాయిన ఆశపడ్డారు. ఈ నకిలీ జీవోను చూసిన చాలామంది అబ్కారీ అధికారులకు ఫోన్ చేసి ఈ విషయమై ఆరా తీశారు. స్పందించిన ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు దీనికి సూత్రధారి సనీష్ అని తేల్చారు.  అతడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: