దేశంలో కరోనా ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఎక్కడిక్కడ బంద్ చేసిన విషయం తెలిసిందే. ఇక రవాణా వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితిలో అయితే మాత్రమే వాహనాలు బయటకు వస్తున్నాయి.  తాజాగా ఓ యువకుడు చేసిన మోసం చివర్లో బయటపడటంతో అడ్డంగా బుక్కయ్యాడు.  వివరాల్లోకి వెళితే.. కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు చెందిన హకామ్ దిన్ ఇటీవల గాయపడ్డాడు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు.

 

అతనికి అయిన గాయం తగ్గి.. వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కానీ బయటకు వెళ్లాలంటే వాహనం రావడం లేదు..దాంతో అతను ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు. తన స్నేహితులను పిలిచి తన పేరు పై ఓ ఫేక్ డెత్ సర్టిఫికెట్ చేయించాడు.  దాంతో అక్కడికి ఓ ప్రైవేటు అంబులెన్స్ వచ్చేలా చేసి అందులో తన ఇంటికి వెళ్లాలని స్కెచ్ వేశాడు.  అంతా అనకున్నట్లుగా ప్లాన్ చేసి ఓ ప్రైవేట్ అంబులెన్స్ లో వెళ్లడానికి తయారయ్యారు. 

 

కానీ పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది. అంబులెన్స్ ఆపివేశారు. లోపల ఉన్న దిన్‌ను చెక్ చేశారు. అతని బతికి ఉండటం తెలిసి ఆశ్చర్యపోయారు.  వెంటనే దిన్, సహా అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా నిర్బందించారు.  ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేయడం తప్పని చెప్పి దాన్ని తయారు చేసిన వారిని అదుపు లోకి తీసుకున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: