కరోనా వైరస్ విషయంలో తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ పంజా విసిరిందనే చెప్పాలి. వైరస్ వ్యాప్తి నియంత్రణ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ గట్టిగానే పనిచేస్తున్నారు. అందుకనే వైరస్ పాజిటివ్ కేసులు తక్కువగానే ఉన్నాయి. అలాంటిది మొన్న అంటే మార్చి 31వ తేదీతో సీన్ మారిపోయింది. ఇందుకు కారణం ఏమిటంటే రెండు రాష్ట్రాల నుండి ఢిల్లీలో జరిగిన మత ప్రార్ధనలకు వెళ్ళి తిరిగి వచ్చిన వారే అనటంలో సందేహం లేదు. ఇలా ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళ వల్లే తెలుగు రాష్ట్రాల్లో వైరస్ బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే మార్చిలో 15 రోజుల పాటు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో  మత ప్రార్ధనలు జరిగాయి. దీనికి విదేశాల నుండే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో హాజరయ్యారు. ఇందులో భాగంగానే రెండు రాష్ట్రాల నుండి సుమారు 2500 మంది వెళ్ళారు. సమస్యంతా ఇక్కడి నుండే మొదలైంది. ప్రార్ధనలకు హాజరై తిరిగి వచ్చిన వాళ్ళల్లో కొందరు అడ్రస్ లేకుండా తిరగటమే సంచలనంగా మారింది.

 

వీళ్ళు మత ప్రార్ధనలకు హాజరవ్వటం తప్పుకాదు. ఎందుకంటే మత ప్రార్ధనలు జరిగిన తేదీకి దేశంలో కరోనా వైరస్ ఇపుడున్నంత ప్రమాధకరంగా లేదు. అయితే ప్రార్ధనలు ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా సమస్య పెరిగిపోయింది. మార్చి 1-15 తేదీల మధ్య జరిగిన ప్రార్ధనల్లో తెలంగాణా నుండి 1030 మంది, ఏపి నుండి 1470 మంది హాజరయ్యారు. విదేశాల నుండి మరో 300 మంది హాజరయ్యారని సమాచారం. వీళ్ళు ప్రార్ధనలు ముగించుకుని తమ సొంతూర్లకు వచ్చే సరికి సమస్య బాగా పెరిగిపోయిందనే  చెప్పాలి.

 

ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన వారిలో రెండు రాష్ట్రాల్లోనూ చాలామంది వైద్య పరీక్షలకు హాజరైనా ఇంకా  300 మంది అడ్రస్ లేకుండా తిరుగుతున్నారు. వీళ్ళ విషయంలోనే ప్రభుత్వాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. వైద్య పరీక్షలు చేయించుకున్న వారిలో కొందరు వైరస్ బాధితులున్నట్లు తేలింది. వీళ్ళ వల్లే వైరస్ బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగే తప్పించుకుని తిరుగుతున్న వారిలో ఎంతమందికి వైరస్ ఉందో తెలీదు. ఉన్నవారు ఇంకా ఎంతమందికి అంటిస్తున్నారో కూడా తెలీక ప్రభుత్వాలు నానా అవస్తలు పడుతున్నాయి. సమస్య తీవ్రత తెలిసి కూడా వీళ్ళసలు ప్రభుత్వం ముందుకు ఎందుకు రావటం లేదో అర్ధం కావటం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: