ఆడ మగ అనే బేధం కేవలం రూపంలోనే కాని ఆలోచనల్లో కాదని కొందరు కిలాడి లేడీలు నిరూపిస్తున్నారు.. చూపులకు ఆడవాళ్లమే కాని చేతలకు మగవాళ్లను మించిపోతామంటూ ఎక్కువగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు.. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నా, చట్టం ఇలాంటి వారిని పట్టుకుని శిక్షించిన మార్పు మాత్రం రావడం లేదు..

 

 

ఇకపోతే ఒక ఈ మధ్యకాలంలో కొందరు నీచులు మీడియా పేరు చెప్పుకుని, దారుణాలకు ఎగబడుతున్నారు.. అక్రమ వసూళ్లు చేస్తూ, సమాజంలో మీడియా అని చెప్పుకున్న వారిని దొంగల్లా చూసే దుస్దితికి తెస్తున్నారు.. మీడియా పరువును బజార్లో నిలపెడుతున్నారు.. ఇలాంటి మరోఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.. ఆ వివరాలు చూస్తే పశ్చిమగోదావరి జిల్లాలో చింతలపూడి పట్టణంలోని పాత పురపాలక సంఘం కార్యాలయం వెనుక అడుసుమిల్లి అనూష రేషన్‌ దుకాణం నడుపుతున్నారు.

 

 

కాగా సోమవారం ఎగ్గేపల్లి అనిత అనే మహిళ అనూష రేషన్‌ దుకాణం వద్దకు వచ్చి తాను యూట్యూబ్‌ ఛానెల్‌ విలేకరినంటూ పరిచయం చేసుకుంది. ఆ తర్వాత రేషన్ దుకాణం వద్ద వీడియో, ఫొటోలు తీసి, నీ రేషన్ దుకాణంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని మీడియాలో ప్రచారం చేస్తానని, దీంతో నువ్వు కేసులో ఇరుక్కుంటావని బెదిరిస్తూ, ఇలా చేయకూడదంటే తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఆ రేషన్ డీలర్ ప్రతిఘటిస్తూ, నీకు డబ్బులు ఎందుకివ్వాలంటూ ప్రశ్నించగా, ఆ మహిళ బ్లాక్ బ్లాక్‌మెయిల్‌కు దిగి, బెదిరింపులకు పాల్పడటంతో అనూష్ జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

 

దీంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. కాగా మీడియా పేరుతో అనేక మంది మోసాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు... ఇక ఇలాంటి వారివల్ల ఇప్పటికే మీడియా పరువు గంగలో కలిసిపోయింది.. నిజమైన మీడియా వారికి విలువ లేకుండా పోతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: