కరోనా మహమ్మారి దాటికి ప్రపంచం అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ను మాత్రం ఈ వైరస్ చావు దెబ్బ తీస్తుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లో అధ్యక్షుడు ట్రంప్ విఫలం కావడంతో కరోనా విలయ తాండవం చేస్తుంది. ఇప్పటివరకు అక్కడ 2లక్షల కరోనా కేసులు నమోదైయ్యాయంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. నిన్న ఒక్క రోజే 25000 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా వల్ల తీవ్రంగా మాస్క్ ల కొరత ఏర్పడింది.
 
దాంతో మాస్క్ లు లేకపోతే కర్చీఫ్ లు కట్టుకోవాలని ట్రంప్ సూచించాడు అంతేకాదు అమెరికా కు ఇది జీవన్మరణ సమస్య అని ప్రజలు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నాడు. మొత్తంగా యూఎస్ఏ లో100,000 - 240,000 మంది కరోనా వల్ల చనిపోతారని ట్రంప్ మెడికల్ అడ్వైసరి అంచనా వేసింది. ఇప్పటివరకు అమెరికా లో కరోనా వల్ల 4000 మరణాలు సంభవించాయి. దాంతో కరోనా మరణాల్లో చైనా ను వెనక్కునెట్టిసింది అమెరికా. కరోనా విషయం లో అక్కడి ప్రభుత్వం ఉదాసీనత గా వ్యవహరించడంతో ఇప్పుడు  ఊహకందని నష్టం చేస్తుంది. 
 
ఇదిలావుంటే స్పెయిన్ ,ఇటలీ ,ఫ్రాన్స్ లో కూడా  కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. ఓవరాల్ గా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 850,000 కేసులు నమోదు కాగా ఇందులో 41,000 మందిమరణించారు..176,000మంది బాధితులు కోలుకుంటున్నట్లు  రిపోర్ట్స్ వెల్లడించాయి. ఇక ఇండియా విషయానికి వస్తే కరోనా రెండో దశలోనే ఉండడం ఊరటనిచ్చే అంశం. అయితే రోజు రోజు కి కేసులుసంఖ్య మాత్రం పెరుగుతూనే వుంది. దేశంలో ఇప్పటివరకు 1600 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా ను అరికట్టేందుకు ప్రస్తుతం  దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్14తో ఈ లాక్ డౌన్ ముగియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: