దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొదట్లో పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా గత రెండు మూడు రోజుల నుండి వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలులోకి తెచ్చినా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడంలో విఫలమవుతోంది. కేంద్రం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను విధించింది. ఏప్రిల్ 14లోపు దేశవ్యాప్తంగా కరోనా కంట్రోల్ అవుతుందా...? అనే ప్రశ్నకు కష్టమే అని సమాధానం వినిపిస్తోంది. 
 
కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో లాక్ డౌన్ ను అమలులోకి తెచ్చాం కాబట్టి కేసుల సంఖ్య అదుపులో ఉందని లేదంటే వేల సంఖ్యలో కేసులు నమోదై ఉండేవని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. దేశంలో గత మూడు రోజుల నుంచి కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఢిల్లీలో మార్చిలో జరిగిన ప్రార్థన సదస్సులే అని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజుల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ వైరస్ ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతున్నాయి. దేశంలో కరోనాను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొనిరావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాల్సి ఉంది. ఇలా చేస్తే మాత్రమే కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
చైనా ఇదే విధంగా దేశంలో కరోనాను పూర్తి స్థాయిలో కంట్రోల్ లోకి తెచ్చింది. వుహాన్ నగరంతో పాటు చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాలను దిగ్బంధించి కోటి మంది జనాభాకు టెస్టులు జరిపించి కరోనాను కంట్రోల్ చేసింది. డిసెంబర్ నెలలో చైనాలో తొలి కేసు నమోదైంది. ఫిబ్రవరి చివరి వారం నాటికి దేశంలో కరోనా పూర్తి స్థాయిలో కంట్రోల్ అయింది. మన దేశం కూడా టెస్టులు చేసి మాత్రమే కరోనాను కట్టడి చేయవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: