కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుంది కరోనా. గంటగంటకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. లక్ష కేసులు దాటి అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు 104,205 కేసులతో టాప్ ప్లేసులో ఉంది. ఆ తర్వాత 86,498కేసులో ద్వితీయ స్థానంలో ఇటలీ.  ఇక కరోనా మరణాల కేసులో ఇటలీ 9,134 మరణాలతో అగ్రస్థానంలో ఉంది.  ఒక్క రోజు వ్యవధిలోనే దాదాపు వెయ్యి మంది మృతి చెందారు. అమెరికాలో కూడా ఈ కరోనా ఎఫెక్ట్ బీభత్సం సృష్టిస్తంది. 

 

కర్ణుడి చావుకు కారణాలనేకమన్నట్టు, అమెరికాలో కేసులు పెరగడానికీ ఎన్నో కారణాలున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షులు ట్రంప్ ప్రజలకు ఓ వైపు ధైర్యాన్ని చెబుతూనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  లాక్​డౌన్లు ప్రకటించినా జనాలు వినిపించుకోలేదు. కరోనా కేసులు పెరుగుతున్నా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ మాత్రం ఏమీ కాదంటూ మాటలు చెప్పుకొచ్చారు. అమెరికా యుద్ధ నౌక థియోడ‌ర్ రూజ్‌వెల్ట్ లో 4,000 మంది చిక్కుకుపోయారు.

 

అక్కడి వారిలో 100 మంది సిబ్బందికి ఇప్ప‌టికే క‌రోనా సోకింది. వారి వల్ల మిగతా 3,900 మందికీ వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కరోనా సోకిన వారిని నౌకలో వేరుగా ఉంచడం ఇబ్బందిగా ఉంద‌ని చెప్పారు. న్యూక్లియ‌ర్ ఎయిర్‌క్రాప్ట్ ను మోసుకెళ్లగలిగే థియోడ‌ర్ రూజ్‌వెల్ట్ నౌకలో ప్రస్తుతం చాలా దుర్భర ప‌రిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నౌక‌లో ఉన్న అందరినీ క్వారంటైన్‌కు తరలించాలని కోరారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: